7-year-old girl rescued from kidnappers

7 year old girl rescued from kidnappers

Kidnap, ap, kanigiri, Uncle, Devirreddy Sahasra, Prakasham

A 7-year-old girl, Devirerddy Sahasra, who was kidnapped from her home in Kanigiri was successfully rescued by the Prakasam district police on Thursday night. According to the details revealed by the police, Sahasra was kidnapped by her uncle Rajesh Reddy, brother of her father Srinivasula Reddy. Devireddy Srinivasula Reddy and his wife Malleswari are government teachers and residents of Kanigiri.

పాపను కిడ్నాప్ చేసింది బాబాయే

Posted: 04/02/2016 06:56 AM IST
7 year old girl rescued from kidnappers

ప్రకాశం జిల్లా కనిగిరిలో కిడ్నాప్ కు గురైన ఆరేళ్ల చిన్నారి సహస్ర కిడ్నాప్ కథ సుఖాంతమైంది. విజయవాడలోని ఓ అపార్ట్ మెంట్ లో చిన్నారి ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు... పక్కా ప్రణాళికతో దాడి చేసి పాపను రక్షించారు. సహస్రను కిడ్నాప్ చేసింది ఆమె సొంత బాబాయ్ రాజేష్ రెడ్డేనని గుర్తించారు పోలీసులు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో వాళ్ల ఫోన్ కాల్స్ పై దృష్టి పెట్టిన పోలీసులు.. కిడ్నాపర్ల నుంచి ఫోన్ రావడంతో వాటిని ట్యాప్ చేశారు. విజయవాడలో పాప ఉందని తెలుసుకొని దాడి చేశారు. ఆ సమయంలో సహస్ర కాళ్లు చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి ఉండటం గమినించారు. వెంటనే వాటిని తీసేసి సహస్రను రక్షించారు.


కనిగిరిలో గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్న దేవిరెడ్డి శ్రీనివాస రెడ్డి కుమార్తె సహస్ర. ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్క్ వేసుకొని, హెల్మెట్లు ధరించి వచ్చారు. పాపను ఎత్తుకొని వెళ్లారు. అనంతరం ఓ మహిళ వీళ్ల ఇంటికి ఫోన్ చేసి విషయం పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించింది. అయితే..అప్పటికే ఫోన్ కాల్స్ పై నిఘా పెట్టడంతో పాప వివరాలు తెలిసాయి. వెంటనే విజయవాడ వెళ్లి దాడి చేయగా.. పాప బాబాయ్ రాజేష్ రెడ్డితోపాటు అతడి స్నేహితుడు సాల్మన్, ఓ మహిళ బషీరాను పోలీసులు అరెస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kidnap  ap  kanigiri  Uncle  Devirreddy Sahasra  Prakasham  

Other Articles