Beggar got 65 lakh lottery

Beggar got 65 lakh lottery

Anantapur, Lottery, Ponnayya, Thiruvananthapuram, Kerala

Anantapur beggar got 65 lakh bumper lottery in Kerala. Ponnayya who begging at Thiruvananthapuram got 65 lakh rupees in Lottery.

భిక్షగాడడికి 65లక్షల లాటరీ..లక్ అంటే ఇదే

Posted: 04/02/2016 06:54 AM IST
Beggar got 65 lakh lottery

అదృష్టదేవత ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదని అంటారు. అచ్చంగా అలాగే ఓ భిక్షగాడికి జరిగింది. బిక్షాటన చేస్తూ పోగేసిన డబ్బులతో కొన్ని ఓ లాటరీ ేకంగా 65 లక్షల రూపాయలు తెచ్చిపెట్టింది. అనంతపురంకు చెందిన వ్యక్తికి కేరళలో తగిలిన లక్ ఇది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన పొన్నయ్య కొన్నాళ్ల క్రితం ప్రమాదంలో కాలు కోల్పోయాడు. అంతకు ముందుదాకా గ్రామంలో వ్యవసాయం సాగించేవాడు. కాలు విరగడంతో పనులు చేసేందుకు శరీరం సహకరించక భిక్షగాడిగా మారాడు. కేరళలోని తిరువనంతపురం బస్టాండ్ పరిసరాల్లో యాచకవృత్తి కొనసాగిస్తున్నాడు.

అలా కేరళలో అడ్డుక్కోవడం ప్రారంభించి.. వచ్చే డబ్బులో కొంత.. అనంతపురంలోని ఇంటికి, మిగతాదాన్ని లాటరీ టికెట్లు కొనేందుకు ఉపయోగించేవాడు. బుధవారం పొన్నయ్య దగ్గరకు పోలీసులు వచ్చారు. ఏమీ మాట్లాడకుండా ఆయనను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. తనను పోలీస్‌స్టేషన్‌కు ఎందుకు తెచ్చారో మొదట పొన్నయ్యకు అర్థం కాలేదు.. తీరా నీకు లాటరీలో రూ. 65లక్షలు వచ్చాయి. దానికి తోడు 90వేల బహుమతులూ వచ్చాయి.. అని పోలీసులు చెప్పడంతో ఆ యాచకుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు. కేరళలో ప్రభుత్వ అనుమతితో లాటరీ వ్యాపారం సాగుతూ ఉంటుంది. అవకతవకలు జరగకుండా పోలీసులే దగ్గరుండి చూసుకుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anantapur  Lottery  Ponnayya  Thiruvananthapuram  Kerala  

Other Articles