New Assembly seats in Telugu states

New assembly seats in telugu states

Assembly, AP, Parliament, Guntur

parliament bil be produce in for rise assembly seats. In Gubtur dist may five assembly seats hike.

కొత్త నియోజక వర్గాలు వస్తున్నాయి

Posted: 04/01/2016 01:00 PM IST
New assembly seats in telugu states

కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపు ప్రయత్నాలు మొదలుపెట్టడంతో ఆశావహుల్లో సందడి మొదలైంది. ఏపీ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్న గుంటూరు జిల్లాలో కొత్త నియోజకవర్గాలు ఎక్కడ రాబోతున్నాయి.. ఎన్ని సీట్లు వస్తాయన్నదానిపై చర్చలు జోరందుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయన్న వార్త రావడంతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం నవ్యాంధ్రలో కొత్తగా 50 నియోజకవర్గాల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాబోయే కాలంలో పార్లమెంటు సమావేశాల్లో సవరణ బిల్లు పెట్టి ఆమోదం పొందేందుకు కేంద్ర సర్కారు సన్నాహాలు చేస్తోంది. దీంతో 2019 ఎన్నికల నాటికే రాష్ట్రంలో కొత్త నియోజకవర్గాలు రూపుదాల్చే అవకాశముంది.

జనాభా దామాషా ప్రకారం ప్రతి రెండు లక్షలా 19 వేల జనాభాకు ఒక నియోజకవర్గం ఏర్పాటు కానుంది. దీని ప్రకారం గుంటూరు జిల్లాలో కొత్తగా ఐదు నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 22కు చేరుతుంది. 2009 ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కారణంగా అప్పటి వరకు జిల్లాలో ఉన్న 19 నియోజకవర్గాలను కుదించి 17కు చేర్చారు. దుగ్గిరాల, కూచినపూడి నియోజకవర్గాలు రద్దయ్యాయి. అప్పటివరకు నాన్ రిజర్వేషన్‌ కేటగిరీలో ఉన్న ప్రత్తిపాడు ఎస్సీ కేటగిరీలోకి వెళ్లింది. ఇదిలా ఉంటే త్వరలో జరగనున్న అసెంబ్లీ స్థానాల పెంపుతో లోక్‌సభ నియోజకవర్గాల స్వరూపమే మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కో లోక్‌సభ స్థానంలో 9 అసెంబ్లీ స్థానాలు ఉండే విధంగా  పునర్విభజన చేయనున్నారు. ప్రస్తుతం ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో 7 నియోజకవర్గాలు ఉండగా అదనంగా రెండు అసెంబ్లీ స్థానాలు కలవనున్నాయి. కొత్తగా ఏర్పడే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి గుంటూరు సెంట్రల్ నియోజకవర్గంగా మిగతా 4 పిడుగురాళ్ళ, చెరుకుపల్లి, పెదకాకాని, నకరికల్లు కేంద్రాలుగా ఏర్పడే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assembly  AP  Parliament  Guntur  

Other Articles