Donald Trump, Abortion Foe, Eyes ‘Punishment’ for Women

Donald trump abortion foe eyes punishment for women

Donald Trump, Amercia, Women, Abortion

Donald J. Trump said on Wednesday that women who seek abortions should be subject to “some form of punishment” if the procedure is banned in the United States, further elevating Republican concerns that his explosive remarks about women could doom the party in the fall.

అబార్షన్ల మీద డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు

Posted: 04/01/2016 07:03 AM IST
Donald trump abortion foe eyes punishment for women

తీవ్ర వ్యాఖ్యలు చేసి దుమారానికి కేంద్ర బిందువుగా మారిన అమెరికా అధ్యక్ష రేసు అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి ఆడవాళ్ల అబార్షన్ గురించి వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యల మీద మహిళ సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అమెరికాలో అబార్షప్లను నిషేదించాలని, అబార్షన్ చేయించుకునే మహిళలను శిక్షించాలరి ప్రకటించారు. ట్రంప్ వ్యాఖ్యలు దుర్భరమని, ఆయన ఆలోచనా ధోరణిని పట్టిస్తున్నాయని డెమొక్రాటిక్ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న హిల్లరీక్లింటన్ దుయ్యబట్టారు. జనం దృష్టిని ఆకర్షించేందుకు ట్రంప్ ఏదైనా మాట్లాడుతారని ఈ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయని రిపబ్లికన్ రేసులో ఉన్న టెడ్‌క్రూజ్ అన్నారు.

ఇటీవల జరిగిన టెర్రరిస్టు దాడులు ప్రజల్లో కలిగించిన భయాందోళనలను రెచ్చగొడుతూ రాజకీయంగా లబ్ధిపొందాలని ట్రంప్ చూస్తున్నారని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఉపాధ్యక్షుడు జోబిడెన్ పరోక్ష ఆరోపణలు చేశారు. ఈస్టర్ సందర్భంగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, ప్రజల మధ్య చీలికలు తెచ్చి అమెరికాను బలహీనం చేయడమే టెర్రరిస్టుల లక్ష్యమని, ఆ కుట్రలకు లొంగరాదని పేర్కొన్నారు. ప్రజల్లో భయాలను రాజకీయ లబ్ధ్ది కోసం వాడుకోవడం మంచిదికాదన్నారు.మొత్తానికి అమెరికా అధ్యక్ష ఎన్నికలు గతంలో కంటే చాలా ఆసక్తికరంగా మారాయి. ట్రంప్ ఎప్పుడు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారో అని అందరూ చర్చించుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  Amercia  Women  Abortion  

Other Articles