jagan will be APs King in future

Jagan will be aps king in future

jagan, YS jagan, Jagan Mohan Reddy, Ap, YSRCP, YCP, YSR Congress, YCP

jagan will be APs King in future. Jagan has to change his behaviour. he has to learn from his father YS Rajashekhar Reddy.

జగన్ లో వస్తే ఛేంజ్.. ఏపికి అవుతారు కింగ్

Posted: 03/30/2016 06:11 AM IST
Jagan will be aps king in future

వైయస్ రాజశేఖర్ రెడ్డి.. తెలుగు రాష్ట్రంలో అప్రతిహతంగా పరిపాలన సాగించిన కీర్తిగన్న ముఖ్యమంత్రి. తెలుగు దేశం పార్టీ స్థాపకుడు నందమూరి తారకరామారావు తర్వాత అంతటి పేరు ప్రతిష్టలు సంపాదించిన నిజమైన నాయకుడు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని ఎక్కడ నొక్కాలో.. ఎక్కడ తొక్కాలో రాజశేఖర్ రెడ్డికి తెలిసినంత ఎవరికి తెలియదంటే అతిశయోక్తికాదు. వైయస్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తొమ్మిదేళ్ల పాటు తెలుగు రాష్ట్రాన్ని ఏలిన, రాజకీయ ఉద్దండుడు నారా చంద్రబాబు నాయుడుకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అయినా కానీ ప్రత్యర్థులను కట్టడి చెయ్యడంలో విఫలమవుతున్న జగన్ తన తండ్రి వైయస్ నుండి నేర్చుకోవాల్సిన కొన్ని అంశాలను నేర్చుకుంటే జగన్ కు తిరుగుండదు.

వైయస్ రాజశేఖర్ రెడ్డిది అవకాశాలను ఒడిసిపట్టడంలో అందెవేసిన చెయ్యి. అందుకే చాలా సార్లు అవకాశాలు ఆయనను వెతుక్కుంటు మరీ దరికి చేరాయి. వైయస్ మాట తీరు కూడా అలాగే ఉండేది. వైయస్ దగ్గరి వారితో ఎలా మాట్లాడినా కానీ ప్రజల ముందు, మీడియా ముందు మాత్రం హుందాగా మాట్లాడేవారు. ఇవే లక్షణాలు జగన్ లో కూడా ఉన్నాయి. ఆడవాళ్లను సంబోధించే విధానం, పలకరించే పద్దతి అన్నింటా కూడా వైయస్ ను పోలి ఉన్నారు.

కానీ వైయస్ కు జగన్ ఓ తేడి ఉంది. వైయస్ చాలా నిదానంగా, ప్రతి అడుగు ఆచితూచి వేసే వారు. కానీ జగన్ మాత్రం అలా కాదు.. ఏది చేసినా కానీ చాలా వేగంగా చేసే మనస్తత్వం బహుషా వయస్సు కారణంగా వైయస్ అలా చేసి ఉండవచ్చు. కానీ వైయస్ ఆలోచనా విధానం ఎవరికి అంతుబట్టని విధంగా ఉండేది. ఆయన ఆలోచించే ప్రతి ఒక్క ఆలోచన కూడా ప్రజలకు సమ్మతించేలా మాట్లాడేవారు. వైయస్ తర్వాత వచ్చిన జగన్ మాట తీరు అంతలా లేదు. అయితే గతంలో జగన్ మాట తీరుకు... ఇప్పటి జగన్ మాట తీరులో మార్పు కొట్టొచ్చినట్లు తెలుస్తోంది. వైయస్ కొన్ని విషయాల్లో దూకుడుగా వ్యవహరించి.. కొన్ని విషయాలను అసలు పట్టించుకునే వారు కాదు. కానీ జగన్ మాత్రం అలా కాదు. తన దృష్టికి ఏ అంశం రాకుండా జరిగినా దాని మీద పూర్తి స్థాయిలో తెలుసుకుంటారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డికి, జగన్ కు ఉన్న మేజర్ తేడా ఏదైనా ఉందీ అంటే అది ఖచ్చితంగా కలుపుగోలు తనమే. వైయస్ మిత్రులు వచ్చినా, శత్రువులు వచ్చినా నవ్వుతూ పలకరించే వారు . కానీ జగన్ మాత్రం అలా కాదు.. శత్రువును ఎప్పటికీ శత్రువుగానే చూస్తున్నారు నిజానికి జగన్ శత్రువుల ముందు కూడా నవ్వుతున్నట్లే కనిపించినా అది కేవలం పెదవుల వద్ద మాత్రమే ఉందని అర్థమయ్యేలా ఉంది. అలాగే వైయస్ రాజశేఖర్ రెడ్డి సీనియర్ల మాటను విన కున్నా కానీ కొన్ని సార్లు మాత్రం వారి సలహాలు, సూచనలు తప్పకుండా పాటించేవారు. కొంత మందిని తన జట్టుగా చేసుకోని పాలనలో తన మార్క్ ను సాదించారు.

కానీ వైయస్ జగన్ మాత్రం కాస్త తలబెరుకును ప్రదర్శిస్తారని తెలుస్తోంది. తన తండ్రితో పాటు కలిసి పని చేసిన మైసూరా రెడ్డి లాంటి సీనియర్ మోస్ట్ నాయకుడిని కూడా జగన్ పక్కన పెట్టేశారు. అలాంటి వ్యక్తులు చెప్పిన మాటను కూడా జగన్ పెడచెవిన పెడుతున్నారని తెలుస్తోంది. కాగా అలా కాకుండా సీనియర్ల మాటలను వింటూనే.. పార్టీని అభివృద్ది చెయ్యడానికి, ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేయడానికి ఉన్న అవకాశాలను వెతికి పట్టుకోవాలి. ఇక జగన్ మాట తీరు విషయానికి వస్తే.. వైయస్ మాట్లాడే ప్రతి మాట సూటిగా.. వినసొంపుగా ఉండేది. కానీ జగన్ మాట తీరులో మాత్రం కాఠిన్యం ఎక్కువగా కనిపిస్తోంది. బహుషా అది ఆయన గొంత స్వబావం అనుకుంటా.

ప్రజాకర్ణక పథకాల పేర్లను ప్రకటించడంలో రాజశేఖర్ రెడ్డి దిట్ట. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో వైయస్ కు బాగా తెలుసు. కానీ జగన్ మాత్రం తాను ఎక్కడ ఉన్నా కానీ విజయం మాత్రం తనదే అన్నట్లు ఉంటారు. వైయస్ కు తెలుగు రాష్ట్రంలో తిరుగులేని ఖ్యాతి ఉన్నా కానీ అధిష్టానం వద్ద మాత్రం పరమ విధేయుడు అన్నట్లుగా కనిపించే వారు. అదే ఆయనకు బాగా కలిసి వచ్చింది. వైయస్ ఎంత ఎదిగినా మన మనిషే అన్న బావన కాంగ్రెస్ వర్గాల్లో తేగలిగారు.కానీ జగన్ మాత్రం అలా కాదు. కేవలం తనకు తానుగా మాత్రమే కట్టుబడే వ్యక్తి.

ఇక అన్నింటికిమించి అవకాశాలు లేని టైంలో కూడా వైయస్ అవకాశాలను సృష్టించుకొనే వారు కానీ జగన్ మాత్రం అలాంటి చాణిక్యతను ప్రదర్శించడం లేదు. వైసీపీ పార్టీ నుండి చాలా మంది నేతలు టిడిపిలోకి వెళుతున్నారు. దాంతో ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తి ఉన్నా కానీ ప్రతిపక్ష పార్టీలో వచ్చిన కుదేలు గురించే అందరూ చర్చించుకుంటున్నారు. అదే జగన్ స్థానంలో గనక వైయస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని నిలదీస్తూ జగన్ లా మీడియా ముందు కాకుండా ప్రజల ముందుకు వెళ్లే వారు. తన మందీమార్భలాన్ని ప్రదర్శించేవారు. అదే మీడియాలో తన గురించి పాజిటివ్ గా వచ్చేలా ప్లాన్ వేసేవారు. ఇలా వైయస్ వ్యవహరించిన తీరులో కొన్ని జగన్ లో కనిపించడంలేదు. కానీ అవే లక్షణాలను జగన్ పొందగలిగితే మాత్రం ఏపికి ఖచ్చితంగా రాజుకాక మానడు.

చంద్రబాబు నాయుడు అనుభవం అంత వయస్సు కూడా లేని జగన్ ఏపి అసెంబ్లీ సాక్షిగా చెమటలు పట్టిస్తున్నారు. మీ తండ్రి వైయస్ నన్ను ఏమీ చెయ్యలేకపోయారు అన్న చంద్రబాబు నాయుడు జగన్ విషయం వచ్చే సరికి కాస్త వెతక వైఖరి అవలంబించేలా చేసింది అంటే అది ఖచ్చితంగా జగన్ ప్రాభల్యమే. అయినా చంద్రాబాబు నాయుడులాంటి అపరచాణిక్యుడి ముందు కూడా జగన్ యుద్దంలో నిలుచున్నారు అంటే ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా కానీ విజయం వరిస్తుంది. ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డి వైయస్ స్థానంలో, ఏపికి రాజుగా మారడం ఖాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : jagan  YS jagan  Jagan Mohan Reddy  Ap  YSRCP  YCP  YSR Congress  YCP  

Other Articles