New smart umberella can predict rain

New smart umberella can predict rain

Rain, Umberele, Oomerella, paris

Paris based company making smart umberella named as oomberella. It will predict rain.

గొడుగులందు ఈ గొడుగు వేరయా..!

Posted: 03/23/2016 11:53 AM IST
New smart umberella can predict rain

పురుషులందు పుణ్యపురుషులు వేరయా.. విశ్వదాభిరామ వినురవేమ అని చదువుకున్నాం. కానీ తాజాగా ఓ గొడుగు గురించి వార్త చదివిన తర్వాత మాత్రం గొడుగులందు ఈ గొడుగు వేరయా అని అనకమానరు. ఎందకంటే ఆ గొడుగు చాలా స్మార్ట్ కాబట్టి. అవును స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్ గురించి విన్నారేమో.. కానీ ఈ స్మార్ట్ గొడుగు గురించి మాత్రం విని ఉండరు కదా. అయితుే ఈ గొడుగు గురించి తెలుసుకొండి.  మామూలుగా వర్షం వస్తుందని ముందు జాగ్రత్తగా గొడుగు తీసుకుపోతాం. కానీ ఆ రోజు మాత్రం వర్షం పడదు. ఇలా చాలా మందికి ఎదురై ఉంటుంది.

కానీ తాజాగా మార్కెట్ లోకి రాబోతున్న ఈ స్మార్ట్ గొడుగు పేరు ఉంబరెల్లా. అంబరిల్లాకు స్మార్ట్ ను జోడించి ఉంబరెల్లాగా మార్చారు. వర్షం వచ్చే ముందు గొడుగు మనల్ని హెచ్చరిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి ఐడియాతోనే  పారిస్ లోని వెజ్జూ అనే స్టార్టప్‌ కంపెనీ ఓ గొడుగును రూపొందించింది.  కంపెనీ వారు మాట్లాడుతూ… ఈ స్మార్ట్ గొడుగుకు  ‘ఊంబరెల్లా’ అని పేరు పెట్టామని అన్నారు. ఇది యాప్‌ సహాయంతో కనెక్టై..  హైపర్‌ లోకల్‌ వెదర్‌ డేటాను ట్రాక్‌ చేస్తుందని,  వర్షం పడటానికి పావుగంట ముందే అలర్ట్‌ చేస్తుందని అంటున్నారు.  ఇక వర్షంలో తడిసే ఛాన్సే ఉండదని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rain  Umberele  Oomerella  paris  

Other Articles