JNU Student leader kanaiah kumar in HCU

Jnu student leader kanaiah kumar in hcu

JNU, JNU Row, HC, HCU Students, Kanaiah Kumar, Hyderabad

Some student leaders oppose Kanaiah kumar arriving HCU. They protesting in HYderabad Central University.

హెసియులో కన్హయ కుమార్... ఉద్రిక్తత

Posted: 03/23/2016 01:07 PM IST
Jnu student leader kanaiah kumar in hcu

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. నిన్న విపి గా అప్పారావు బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో కొంత మంది విద్యార్థి నేతలు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ మీద దాడికి పాల్పడ్డారు. దాంతో ఇద్దరికి గాయాలు కాగా ఫర్నీచర్ ధ్వంసమైంది. కాగా దిల్లీ నుండి జెఎన్.యు విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ కుమార్ రాకతో మరోసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాతావరణం నెలకొంది. పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మీడియాను కూడా యూనివర్సిటీలోకి అనుమతించడం లేదు.

రోహిత్ తల్లికి మద్దతు తెలిపేందుకే తాను వచ్చినట్లు జెఎన్ యూ నేత కన్హయ్య తెలిపారు. కన్హయ్యకుమార్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. పలు విద్యార్థి సంఘాలు కన్హయ్యకు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయంత్రం హెచ్ సీయూకి వెళ్తానని చెప్పారు. రోహిత్ చట్టం చేసే వరకు పోరాడుతానని తేల్చి చెప్పారు. ఈరోజు సాయంత్రం కన్హయ్య హెచ్ సీయూకు వెళ్లనున్నారు. సాయంత్రం వర్సిటీలో జరుగనున్న సభలో ఆయన ప్రసంగించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JNU  JNU Row  HC  HCU Students  Kanaiah Kumar  Hyderabad  

Other Articles