UP polls: Want BJP ticket, bring 25k likes on FB

Want bjp ticket bring 25k likes on fb says bjp

up assembly elections, 5 state elections, social media, amit shah, bjp tickets, uttar pradesh, pm modi, narendra modi, Facebook, Twitter, social media, Laxmikant Bajpai, Shamli MLA Suresh Rana, Meerut Rajendra Agarwal, Kunwar Bhartendra Singh, fan page

In a matter of seconds, two major accidents took place at the same spot in Karimnagar city. Both the victims were women and fortunately, both are out of danger.

సోషల్ మీడియాకే అధిక ప్రాధాన్యం.. 25 వేల లైకులోస్తేనే టిక్కెట్లు..

Posted: 03/17/2016 04:37 PM IST
Want bjp ticket bring 25k likes on fb says bjp

సోషల్ మీడియాను అధికంగా ఫాలో అవుతున్న కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని అటు పార్టీ కూడా అన్ని రంగాలలో అమలుచేయాలని యోచిస్తుంది. పార్టీ అన్ని రాష్ట్ర శాఖలు కూడా సోషల్ మీడియాను విధిగా ఫాలో అవ్వాలని ఎప్పటినుంచో వున్న అదేశాలతో పాటు తాజాగా మరో కొత్త సంప్రదాయానికి కూడా బీజేపి జాతీయ అధ్యక్షుడు తెరతీశారు. త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉత్సాహపడుతున్న అభ్యర్థులకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఓ కొత్త షరతు పెట్టారు.

అమిత్ షా పెట్టిన షరతు తెలుసుకున్న పార్టీ అభ్యర్థులకు దిమ్మతిరిగింది. సోషల్ మీడియాలో చాలా తక్కువగా ఉంటున్న యూపీ బీజేపీ నేతలకు.. టికెట్ కావాలంటే కనీసం ఫేస్‌బుక్‌లో 25వేల లైకులు లేదా, ట్విట్టర్‌లో 25 వేల మంది ఫాలోవర్లు ఉండాలని అమిత్ షా అన్నారట. ఈ లెక్కన చూసుకుంటే అక్కడ ఎవరికీ అంత పరిస్థితి లేదు. సాక్షాత్తు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్‌పాయికే ట్విట్టర్‌లో 10వేల మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. షామ్లి ఎమ్మెల్యే, ముజఫర్‌నగర్ అల్లర్ల కేసు నిందితుడు సురేష్‌ రాణాకు 12,856 మంది ఫేస్‌బుక్‌లో ఫాలోవర్లున్నారు. మీరట్ ఎంపీ రాజేంద్రకుమార్ అగర్వాల్‌కు 13,957 లైకులు ఉండగా, బిజ్నోర్ ఎంపీ కువర్ భతేంద్ర సింగ్‌ ఫేస్‌బుక్ ఖాతాకు మాత్రం కేవలం 2,986 మంది స్నేహితులే ఉన్నారు.

కానీ, నాయకుల పాపులారిటీ చూడాలంటే జనంలో తెలుస్తుంది గానీ సోషల్ మీడియాను బట్టి లెక్కించడం ఏంటని కొంతమంది నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్ లాంటి వాళ్లు మాత్రం కేవలం మూడు నెలల్లోనే అమిత్ షా ఇచ్చిన లక్ష్యాన్ని సాధించగలనని ధీమా వ్యక్తం చేశారు. యువతను ఆకట్టుకోడానికి ఇది మంచి మార్గమని, కొన్ని రోజుల క్రితం తనకు ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తి అసెంబ్లీలో ఫలానా సమస్య మీద ప్రశ్నించాలంటూ మంచి సూచన కూడా పంపారని షామ్లి ఎమ్మెల్యే సురేష్ రాణా తెలిపారు. తనకు ఫ్యాన్ పేజీ లేదని, అది మొదలుపెడితే కనీసం లక్ష లైకులు వస్తాయని ధీమాగా చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles