All Is Well With NTR, Say Producers

Fans panicked over ntr s accident rumours

Janata Garage, Koratala Siva, Mythri Movie Makers, NTR, Samantha, Telugu Cinema, Andhra Pradesh, Hyderabad,cinema, Telugu cinema

NTR has been shooting for Janatha Garage in Mumbai. This morning, a fake Twitter handle of Mythri Movie Makers, the production house behind Janatha Garage, left NTR's fans in panic.

యంగ్ టైగర్ ఎన్టీయార్ క్షేమం.. ఆ వదంతులను నమ్మకండీ..

Posted: 03/16/2016 05:59 PM IST
Fans panicked over ntr s accident rumours

ప్రముఖ సినీనటుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ లో ప్రమాదం బారిన పడి గాయపడినట్లు వచ్చిన వార్తలు కేవలం పుకార్లేనని జూనియర్ ఎన్టీఆర్ పబ్లిక్ రిలేషన్ ప్రతినిధి మహేష్ ఎస్ కోనేరు స్పష్టం చేశారు. ఈ వదంతులను నమ్మవద్దని అదని ఎవరో చేసిన అకతాయి పనులని అన్నారు. ఎన్టీయార్ కు ఏమీ కాలేదని, అకతాయిల పుకార్లతో ఎవరూ అందోళన చెందవద్దని కోరారు,

'జనతా గ్యారేజ్ సినిమాకు సంబంధించిన ఏ విషయం అయినా మైత్రీ అఫీషియల్ (@MythriOfficial) పేజీ ద్వారానే వస్తాయి. జనతా గ్యారేజ్ పేరుతో ఎటువంటి అఫీషియల్ పేజీ లేదనీ,  వదంతులను నమ్మొద్దని కోరారు. తారక్ కు ఏమీ కాలేదని  అని  ఆయన ట్విట్టర్ లో తెలిపారు.  మరో వైపు నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ కూడా ట్విట్టర్ ద్వారానే వివరణ ఇచ్చింది.  షూటింగ్ లోఎలాంటి ప్రమాదం జరగలేదని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.   దీంతో  ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.  

కొద్ది సేపటి కిందట జనతా గ్యారేజ్ చిత్రం షూటింగ్ లో ప్రమాదం సంభవించిందని, ఎన్టీయార్ కు గాయాలయ్యాయని వచ్చిన వార్తలు ఆయన అభిమానులను కలవరపర్చాయి. ఉన్నట్టుండి జనతా గ్యారేజ్  ట్విట్టర్ పేజీలో ఈ షాకింగ్ న్యూస్ చూసి ఫ్యాన్స్ కంగారు పడ్డారు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో నిజానిజాలు కనుక్కునే ప్రయత్నం చేసారు. సోషల్ మీడియాలో అనేక ప్రశ్నాలు, అనుమానాలు వెల్లువెత్తాయి. కొద్దిసేపటికే ఆ పేజీ  బ్లాక్ అయింది. ఈ పుకార్లపై చిత్ర నిర్మాతలు వెంటనే వివరణ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కు ఏమీ కాలేదని..అవన్నీ పుకార్లని తేల్చారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Jantha Garage  Accident  Rumots  Mythri Makers  

Other Articles