high court reserves roja suspension case for thursday

Roja suspension case decision reserved for thursday

Roja, Suspension Case, Reserved for Thursday, high court, supreme court, ysrcp

Andhra Pradesh-Telangana joint High Court here on Wednesday reserved its decision in YSR Congress Party MLA R.K. Roja's suspension case for Thursday.

ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ కేసులో వాదనలు పూర్తి.. తీర్పు రేపటికి వాయిదా

Posted: 03/16/2016 06:32 PM IST
Roja suspension case decision reserved for thursday

సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పిటిషన్పై విచారణను చేపట్టిన హైకోర్టులో ఇవాళ వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు గురువారానికి వాయిదా  వేసింది. పిటిషన్పై వాదనలు సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యే రోజాపై 340 నిబంధన కింద తీర్మానం పెట్టి సస్పెండ్ చేశారని,  కానీ..ఆ విషయాన్ని ఇప్పుడు మారుస్తున్నారని   ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎలాంటి చర్యలు తీసుకున్నా చట్ట ప్రకారం వుండాలని హైకోర్టు  ప్రభుత్వ  న్యాయవాదికి తెలిపింది. అయితే..ఆ రోజు సభలో ఏం చేశారు అన్నదానిపై ప్రభుత్వ రికార్డుల్లో లేదని హైకోర్టు దృష్టికి అడ్వకేట్ జనరల్ తెచ్చారు.  ఎథిక్స్‌ కమిటీ తన నివేదికలో పొందపర్చవచ్చని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వెల్లడించారు.
 
ఎమ్మెల్యే రోజా తరఫున  సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ తన వాదనలు వినిపించారు. ఆమె ఏమన్నారంటే.. అసెంబ్లీ అయినా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. సభలో వాయిదా తీర్మానం ఇచ్చారని ఆ రోజు రోజాను సస్పెండు చేశారు. సభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఒక సభ్యుడిని సమావేశాలు పూర్తయ్యే వరకే సస్పెండు చేయొచ్చని, ఈ రకంగా సస్పెన్షన్ ఎలా చేస్తారు. ఆ రకంగా అయితే ఇక మొత్తం ప్రతిపక్షాన్ని ఐదేళ్ల పాటు సస్పెండు చేస్తారా.. సెక్షన్ 340 ప్రకారం సభ్యురాలిని ఏడాది పాటు సస్పెండు చేసే అధికారం లేదు. ఆ నిబంధన కేవలం సభను ఆర్డర్ లో పెట్టడానికి సజావుగా నడిపించడానికి మాత్రమే.
 
ఒకవేళ ఆ సెక్షన్ ప్రకారం కాదు.. సెక్షన్ 194 ప్రకారం సస్పెండు చేశామని ప్రభుత్వ వాదన సరికాదని, పొరపాటున 340 నిబంధనను ఉటంకించామని అంటే... రోజాపై సస్పెన్ష ఆర్డర్ చెల్లుబాటు కాదు. సస్పెన్షన్ విధిస్తున్నప్పుడు రోజా పేరు కూడా చెప్పలేదు. కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఆమెకివ్వలేదు. పైగా నిబంధన 340 కింద సస్పెండు చేసే అధికారం లేదు. ఈ విషయంలో మా క్లయింట్ కు పూడ్చలేని నష్టం జరిగింది. కేసు తుది తీర్పు వెలువడే వరకు ప్రస్తుత బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి తీర్పును రేపటికి వాయిదా వేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  Suspension Case  Reserved for Thursday  high court  supreme court  ysrcp  

Other Articles