Supreme Court asks High Court to hear plea today

Supreme court asks high court to hear plea today

Roja, YSRCP, AP, Assembly, Suspension, Supreme Court, High Court

consisting Justice Gopala Gowda and Justice Arun Mishra here on Tuesday directed the High Court of Judicature, Hyderabad, to take up the petition of the suspended MLA of the YSRCP, Roja, on Wednesday itself in a big relief to her.

నేడు హైకోర్టులో రోజా సస్పెన్షన్ పై విచారణ

Posted: 03/16/2016 09:00 AM IST
Supreme court asks high court to hear plea today

వైసీపీ ఫైర్ బ్రాండ్ మరోసారి ఏపి అసెంబ్లీలో పేలే అవకాశం ఉంది. ఏడాది సస్సెన్షన్ సు సవాల్ చేస్తు నగరి ఎమ్మెల్యే రోజా సుప్రీం కోర్ట్ మెట్లు ఎక్కినందుకు ఊరట లభించింది. ఇక్కడి కోర్టులు ఆమె కేసును విచారణకు ఒప్పుకోకపోవడంతో…ఆమె సుప్రీంలో తన ఆవేదనను చెప్పుకుంది. తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని వాదన వినిపించింది. కనీసం తనకు నోటీస్ కూడా ఇవ్వలేదని.. తన సంజాయిషీ కూడా అడగలేదని వాదించింది. సస్పెండ్ చేశాకనైనా నోటీస్ ఇచ్చారా అంటే అదీ లేదని.. తను ఏ తప్పు చేయకున్నాబయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రజా సమస్యలను నిలదీస్తున్నానన్న కక్ష్యతో బయటకు పంపారని... తనకు న్యాయం చేయాలని రోజా సుప్రీంలో వేడుకున్నారు. దీనికి కింది కోర్టులు విచారణ జరిపేందుకు ఒప్పుకోలేదని ఫిర్యాదు చేయడంతో…సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ఫిర్యాదును అసిస్టెంట్ రిజిస్ట్రార్ హైకోర్ట్ లో తిరస్కరించారని రోజా తరపు లాయర్ ఫిర్యాదు చేయడంతో…ధర్మాసన ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనికి ఏం అధికారం ఉంటుంది. ఇంకోసారి ఇలా చేస్తే అతనిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జడ్జీలు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని అతనెలా ప్రకటిస్తారు. ఏ సస్పెన్షన్ అయినా ఆయా సమావేశాలకే వర్తిస్తాయి. దీనిపై విచారణ చేయకుంటే ఎలా? దేశంలో ఏం జరుగుతోందని …వెంటనే నేడు హైకోర్ట్ లో విచారణ చేయాలని ఆదేశాలు జారీచేసింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  YSRCP  AP  Assembly  Suspension  Supreme Court  High Court  

Other Articles