India self-destruct, New Zealand spin a 47-run upset win

India self destruct new zealand spin a 47 run upset win

Team India, Newzeland, T20, T20 World Cup

Self-destruction by India, 'pitch' perfect planning by New Zealand. There's hardly a better way to describe what Jamtha witnessed on Tuesday. When not a soul doubted India cruising to 127, New Zealand's three-spinner strategy stumped the fancied hosts.

కివీస్ చేతిలో టీమిండియా ఓటమి

Posted: 03/16/2016 08:49 AM IST
India self destruct new zealand spin a 47 run upset win

ఆతిథ్య హోదాలో టీమ్ ఇండియాకు టీ20 ప్రపంచకప్‌లో చేదు పరాజయం. దేశం మొత్తం టీవీలకు అతుక్కుపోయిన వేళ అభిమానుల ఆశలను నిలువునా ముంచుతూ ధోనీసేన ఆరంభమ్యాచ్‌లోనే దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. పొట్టి ఫార్మాట్‌లో తమకు ఎదురేలేదన్నట్లుగా దూసుకొచ్చిన ధోనీసేనకు సొంతగడ్డపై తొలి మ్యాచ్‌లోనే ఊహించని షాక్ ఎదురైంది. నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన తమ తొలి లీగ్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 47 పరుగుల తేడాతో చిత్తయింది.

ప్రముఖ న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ క్రో కి ఘనంగా నివాళులు అర్పిస్తూ ప్రపంచ కప్ స్టార్ట్ అయ్యింది. అసలు సిసలైన T20 మజా మొదలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ బ్యాటింగ్ కి ఎంతో కాన్ఫిడెంట్ తో దిగింది. స్పిన్ ఆడటంలో న్యూజిలాండ్ వీక్ అని తెలిసిన ధోనీ తెలివిగా అశ్విన్ ని బౌలింగ్ కి దింపాడు. న్యూజిలాండ్ ఓపెనర్ గుప్తిల్ ధోని నిర్ణయం తప్పు అంటూ మొదటి బంతినే సిక్సర్ గా మలిచాడు. ఆతర్వాత చెలరేగిన అశ్విన్ స్పిన్ టర్న్ కి వెంటనే వికెట్ల ముందు దొరికిపోయాడు. అంతే, స్టేడియం హోరెత్తిపోయింది. తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ వరుసగా క్యూ కట్టారు. ఆండర్సన్, టేలర్ మాత్రమే కాసేపు రన్స్ కొట్టారు. కానీ దురదృష్టవశాత్తూ టేలర్ ని రైనా అద్భుతంగా రన్ అవుట్ చేశాడు. న్యూజిలాండ్ కి ఇక్కడే సరైన దెబ్బతగిలింది. ఆ జట్టు కెరియర్ లోనే తక్కువ స్కోర్ (126) రన్స్ చేసింది.

అ తర్వాత బ్యాటింగ్ కి దిగిన టాప్ ఇండియన్ ఆర్డర్ , వరల్డ్ క్లాస్ బ్యాట్స్ మెన్స్ అందరూ వరుసగా క్యూ కట్టారు. ట్వంటీ ట్వంటీలలోనే అతి తక్కువ స్కోర్ కొట్టలేక 79 పరుగులకే చతికిలబడ్డారు. ఒకవైపు కోహ్లీ తనదైన స్టైల్లో క్లాసికల్ ఇన్నింగ్స్ ఆడుతుంటే మిగతా బ్యాట్స్ మెన్స్ అందరూ ఈ మ్యాచ్ ఆడటం మా వల్ల కాదు అనుకున్నారో, లేదా వరల్డ్ కప్ ఆడుతున్నామని మర్చిపోయారో తెలీదు కానీ పెవిలియన్ కి క్యూ కట్టారు. బహుశా ఇది ఐపియల్ ఫ్రెండ్లీ మ్యాచ్ అనుకున్నారేమో. కొండంత ఆశతో స్టేడియంకు వచ్చిన ఆడియన్స్ కి గుండెల్లో గునపాలు గుచ్చారు. సాట్రన్, సోధీలు టర్న్ తో ఇండియన్ బ్యాట్స్ మెన్ కి చుక్కలు చూపించారు. మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ చెప్పుకోవాలి కాబట్టి, సోధీ వేసిన మొదటి బంతికి కోహ్లీ కీపర్ కి క్యాచ్ ఇవ్వడంతోనే మ్యాచ్ చేజారిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  Newzeland  T20  T20 World Cup  

Other Articles