Ap Assembly may pass a motion which indicates central govt Help as per Bifercation Laws

Ap assembly may pass a motion which indicates central govt help as per bifercation laws

Ap, Special Status, package, Assembly, Central Govt, NDA, Polavaram

Ap Assembly may pass a motion which indicates central govt Help as per Bifercation Laws. chandrababu govt ready to give full credit of Polavaram to Central Govt.

విభజన హామీలపై ఏపి అసెంబ్లీలొ తీర్మానం..!

Posted: 03/16/2016 08:41 AM IST
Ap assembly may pass a motion which indicates central govt help as per bifercation laws

ఏపికి విభజన తర్వాత సరైన న్యాయం జరగలేదు అన్న గొంతుకలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిన్న పార్లమెంట్ లోని ఉభయసభల్లో ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని కాంగ్రెస్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దాంతో మరోసారి ఏపి ప్రత్యేక హోదా అంశం తెర మీదకు వచ్చింది. కాగా ఇప్పటి దాకా ప్రత్యేక హోదా దక్కలేదు. విభజన హామీలు నెరవేరట్లేదు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు రావట్లేదు. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెంచే యత్నం చేస్తోంది ఏపీ సర్కార్. ప్రత్యేక హోదాతో సహా విభజన హామీల్ని అమలు చేయాలని కోరుతూ నేడు అసెంబ్లీలో తీర్మానం చేయనుంది. ఈ మేరకు టీడీఎల్పీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పూర్తిగా కేంద్రానికి అప్పగించాలని కూడా యోచిస్తున్నారు.

2018 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలనేది చంద్రబాబు ధ్యేయం. అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగేళ్లు అన్న చంద్రబాబు ఏడాది నుంచి మూడేళ్లలో పూర్తిచేస్తామని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలో ఉన్న ముంపు మండలాల్ని ఏపీలో కలిపేలా, అలానే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించేలా చేయడంలోనూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సక్సెస్ అయ్యారు చంద్రబాబు. కానీ పోలవరం ప్రాజెక్టుకు నిధులు సాధించుకోవడంలో విఫలమయ్యారు.

విభజన చట్టం హామీలు అందునా ముఖ్యంగా ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు సాధించే క్రమంలో విమర్శలు ఎదుర్కొంటున్న టీడీపీ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. కేంద్రం సహాయంలేనిదే పోలవరం పూర్తిచేయడం అసాధ్యమైన తరుణంలో ఆ క్రెడిట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని చెబుతోంది. భూ సమీకరణ, ఇతర అంశాల బాధ్యతను తమ అధీనంలో ఉంచుకుంటూ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల్ని కేంద్రానికే అప్పగించేందుకు సై అంటున్నారు చంద్రబాబు. పోలవరం ఒక్కటే అని కాదు విభజన చట్టంలోని హామీల్ని నెరవేర్చేలా నేడు అసెంబ్లీలో తీర్మానం చేయనుంది టీడీపీ సర్కార్. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపి మోదీ సర్కార్-పై ఒత్తిడి పెంచనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ap  Special Status  package  Assembly  Central Govt  NDA  Polavaram  

Other Articles