World T20: Confident India commence title bid with New Zealand game

Confident team india commence wt20 title bid with new zealand

World T20, India, New Zealand, Asia Cup, Cricket, Mahendra Singh Dhoni, VCA Stadium , World T20, Confident India commence title bid with New Zealand game, cricket news, cricket

No host country has won the T20 world title in the last five editions and none has repeated a title triumph

రేపటి నుంచే టీ20 వరల్డ్ కప్.. న్యూజీలాండ్ ను ‘ఢీ’ కొననున్న భారత్

Posted: 03/14/2016 06:17 PM IST
Confident team india commence wt20 title bid with new zealand

టి-20 ప్రపంచ కప్ గెలిచిన తొలి ఆతిథ్య జట్టుగా రికార్డు సృష్టించేందుకు టీమిండియా సన్నద్ధమైంది. ఈ మెగా ఈవెంట్లో ధోనీసేనకు న్యూజిలాండ్ రూపంలో తొలి సవాల్ ఎదురవుతోంది. మంగళవారం నాగ్పూర్లోని వీసీఏ స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. 2007లో జరిగిన టి-20 ప్రపంచ కప్లో ధోనీసేన విజేతగా నిలిచింది. కాగా ఇప్పటి వరకు ఐదు టి-20 ప్రపంచ కప్లు జరగగా, ఒక్కసారి కూడా ఆతిథ్య జట్టు విజేతగా నిలవలేదు.

టీ20 వరల్డ్ కప్'లో భారత విజయానికి జట్టులోని సభ్యులందరూ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ తెలిపారు.  ప్రపంచంలోనే ఉత్తమ జట్లు ఈ సిరీస్లో ఆడుతుండటంతో మ్యాచ్లు పోటా పోటీగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. గతంలో చేసిన తప్పిదాలను ఈ సిరీస్ లో పునరావృతం చేయకుండా గ్రౌండ్లో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. గత 11 మ్యాచ్లలో 10 మ్యాచ్లు గెలచి కప్ విజయంపై విశ్వాసంతో ఉన్నామన్నారు. సొంతగడ్డపై ఈ టోర్నీ జరగడం కూడా తమకు కలిసివస్తుందన్నాడు.

టీ 20 క్రికెట్లో ధోనీసేన వరుస విజయాలు సాధిస్తూ ఆల్రౌండ్ షోతో అదరగొడుతోంది. అంతేగాక సొంతగడ్డపై ఆడనుండటం, అభిమానుల మద్దతు పుష్కలంగా ఉండటం కలసివచ్చే అంశం. ఇక భారత జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ రాణిస్తున్నారు. ఇక సురేశ్ రైనా, యువరాజ్ సింగ్, ధోనీ వంటి హిట్లర్లు ఉండనే ఉన్నారు. బౌలింగ్లో ఆశీష్ నెహ్రా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, అశ్విన్, జడేజా కీలకం.  

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian cricket  T20 world cup  New Zealand  cricket  

Other Articles