Woman who bit off boyfriend's tongue arrested

Woman who bit off boyfriend s tongue arrested

Kiss, French Kiss, Boy Friend, Tounge

A woman who bit off her boyfriend's tongue during a kiss on his birthday was jailed for three years today. Tracy Davies, 40, severed the first third of Mark Coghill's tongue in "an animal fashion" after asking him for a "smoochy kiss", Newcastle Crown Court heard.

ప్రియురాలి ఫ్రెంచ్ కిస్... ప్రియుడి నాలుక కట్

Posted: 03/05/2016 10:54 AM IST
Woman who bit off boyfriend s tongue arrested

ప్రియురాలిని ఎవరైనా కౌగిలించుకోవాలి.. ముద్దు పెట్టుకోవాలి అనుకుంటారు. ప్రియురాలికి కూడా అలాగే ఉంటుంది. తన ప్రియుడికి ఎప్పటికి గుర్తిండిపోయేలా ముద్దు పెట్టాలని అనుకుంటుంది. అయితే ఓ ప్రేయసి కూడా ఇలాగే తన ప్రియుడికి గట్టిగా ముద్దు పెట్టింది.. ఎంత గట్టిగా అంటే ప్రియుడి నాలుక తెగేలాగా. షాక్ తిన్న ప్రియుడు తెగిపోయిన నాలుక ముక్కను చేతబట్టుకొని హుటాహుటిన ఆసుపత్రికి పరుగెట్టాల్సి వచ్చింది. అమెరికాలోని కనెక్టికట్ లో హార్ట్ ఫోర్డ్ సిటీలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం కలిగించింది. షకియా లాంగ్ అనే 37 ఏళ్ళ మహిళ తన ప్రియుడు 41 ఏళ్ళ డ్వేన్ విలియమ్స్ తో కలిసి సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఇంట్లో మత్తు పదార్థాలను మోతాదుకు మించి తీసుకున్న అనంతరం విలియమ్స్ ను కిస్ చేస్తూ.. షకియా లాంగ్ అతని నాలుకను కొరికేసింది. ఒక్కసారిగా నాలుక తెగిపోవడంతో బయటకు పరిగెత్తిన విలియమ్స్ అటుగా వెళ్తున్న పోలీసు సహాయంతో ఆసుపత్రికి చేరాడు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు షకియాపై కేసు కూడా నమోదు చేశారు. తెగిపడిన నాలుకకు వైద్యులు అతికష్టం మీద అతికించారు. ఘటన జరిగిన సమయంలో చాలా రక్తం పోయిందని విలియమ్స్ పోలీసులకు తెలిపాడు. మార్చ్ 31న ఈ కేసుకు సంబంధించి షకియా కోర్టుకు హాజరుకానుంది. అయితే ఆసమయంలో విలియమ్స్ గాయపడిన సంగతే తనకు తెలియదని షకియా చెబుతుండటం విశేషం.మరి మత్తులో మునిగిపోయినప్పుడు ఏం జరిగిందో ఏం తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kiss  French Kiss  Boy Friend  Tounge  

Other Articles