‘Teen Mom’ Farrah Abraham Accuses Uber Driver Of Trying To ‘Rape’ Her

Farrah abraham reveals she was almost raped

farrah abraham, Reality TV personality Farrah Abraham, hollywood actress farrah abraham, Simon Saran, rescue, non-boyfriend, farrah abraham banned from Uber, Teen Mom star, Uber driver almost raped me alleges hollywood actress, Persian dude

hollywood actress Farrah Abraham claims to have had a super scary incident where an Uber driver tried to rape her

ఉబర్ క్యాబ్ డ్రైవర్ నాపై దాదాపుగా అత్యాచారం చేశాడు.. రియాల్టీ టీవీ స్టార్

Posted: 03/05/2016 10:10 AM IST
Farrah abraham reveals she was almost raped

ఏం మాయ రోగం దాపురించిందో తెలియదు కానీ ప్రపంచ వ్యాప్తంగా మగ మృగాళ్లకు అబలలను చూడగానే కామవాంఛ తట్టి లేస్తుంది. నియంత్రణ కోల్పోయిన పైశాచిక మృగాళ్లు వారిపై అఘాయిత్యాలను పాల్పడుతూనే వున్నారు. అయితే ఇది ఏ ఒక్క దేశంలోనో కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకోంది. తమ కుటుంబాలకు, సన్నిహితుల చెందిన మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే తాము పడే ఇబ్బందులను కూడా ఊహించుకోకుండా ఎవరో మహిళ అంటూ మరో కుటుంబానికి చెందిన వారిపై అఘాయిత్యాలకు పాల్పడటం ఎంత దారుణం.

ఇక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో తమ సేవలను అందిస్తున్న ఉబర్ క్యాబ్ సర్వీసెస్ తమ క్యాబ్ లకు సక్రమైన డ్రైవర్లను నియమించుకోలేదన్న విమర్శలు అధికంగా వినబడుతున్నాయి. దేశంలోని న్యూఢిల్లీలో ఓ ఉద్యోగి తన సన్నిహితులతో కలసి హోటల్ నుంచి ఇంటికి వెళ్తుండగా అమె నిద్రలోకి జారుకోవడాన్ని అసరాగా చేసుకుని అమెను నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లిన సదరు డ్రైవర్ అమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇది ఉబర్ క్యాబ్ డ్రైవర్ మన దేశంలో జరిపిన సంచలన ఘటన. అయితే ఈ క్యాబ్ సర్వీసులపై ప్రపంచ వ్యాప్తంగా అనేక అరోపణలు వినబడుతున్నాయి.

తాజాగా ఇలాంటి ఘటనలో ఓ నటిపైనే దారుణానికి పాల్పడబోయాడు ఉబర్ క్యాబ్ డ్రైవర్. ఇటీవల ఓ రోజు అర్ధరాత్రి ఉబర్ డ్రైవర్ తాను దాదాపు రేప్ చేయబోయాడని ప్రముఖ హాలీవుడ్ టీవీ నటి ఫర్హా అబ్రహం వెల్లడించింది. ఉబర్ ట్యాకీ డ్రైవర్ తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని, వెంటనే తన బోయ్‌ఫ్రెండ్ వచ్చి కాపాడి ఉండకుంటే తనపై అఘాయిత్యం జరిగి ఉండేదని ఆమె పేర్కొంది. ఈ ఘటనతో ఉబర్‌ సంస్థను తాను పూర్తిగా నిషేధించానని, అప్పటినుంచి ఆ కంపెనీ ట్యాక్సీలను అస్సలు ఎక్కడం లేదని ఆమె తెలిపింది.

'టీన్‌ మామ్' టీవీ సీరిస్ తో పాపులరైన ఈ రియాల్టీ షో స్టార్‌ ఈ ఘటన గురించి తాజాగా వివరించింది. 'ఉబర్‌ డ్రైవర్ ఒకడు నన్ను దాదాపు రేప్ చేయబోయాడు. నా స్నేహితుడు సిమన్ సరన్ రావడంతో సరిపోయింది. సరన్‌ కారు అద్దాన్ని దాదాపు బద్దలుకొట్టి.. డ్రైవర్‌ను బయటకు తోసేశాడు. వెంటనే పోలీసులకు సమాచారమందించడంతో వారు వచ్చారు. పోలీసులు వచ్చినా ఆ పర్షియన్ వ్యక్తి నా వెంట పడ్డాడు. పోలీసులే అంత.. మనల్ని ఒకడు వేధిస్తున్నాడని చెప్పిన తర్వాత కూడా పట్టించుకోరు' అని ఆమె ఫర్హా పేర్కొంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Farrah Abraham  rape  Reality TV star  Uber driver  

Other Articles