congress senior leader Ram Reddy Venkat Reddy died

Congress senior leader ram reddy venkat reddy died

Ram Reddy Venkat Reddy, Congress, Telangana, Died

congress senior leader Ram Reddy Venkat Reddy died. He admitted in secendrabad KIMS. His last breath stopped at this morning

రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతి

Posted: 03/04/2016 12:00 PM IST
Congress senior leader ram reddy venkat reddy died

ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే, మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంగో బాధపడుతున్నారు. అప్పటి నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. నాలుగేళ్లుగా  ఆయన ఊపిరితిత్తుల వ్యాధికి సికింద్రాబాద్ కిమ్స్‌లో వైద్యం చేయించుకుంటున్నారు. కాగా రాంరెడ్డి వెంకటరెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో  ఈ రోజు ఉదయం మృతి చెందారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికైన ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు.

రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతి పై తెలంగాణ సిఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అసెంబ్లీలో అందరితో కలుపుగోలుగా తిరిగే వ్యక్తి అని ఆయన గురించి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తర్వాత సర్వత్రా టిఆర్ఎస్ హవా కొనసాగుతున్న సమయంలో కూడా పాలేరు నుండి బరిలోకి దిగి విజయాన్ని సాధించారు. నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి హఠాన్మరణంతో తెలంగాణ పిఎసి కమిటీలో సభ్యుడి హోదా నుండి పిఎసీ చైర్మెన్ గా నియమితులయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Reddy Venkat Reddy  Congress  Telangana  Died  

Other Articles