77-year-old set for 47th shot at Class 10 exam

77 year old set for 47th shot at class 10 exam

Rajasthan, 10th Exam, Student, Shiv shankar Yadav

77-year-old Rajasthani villager is getting ready to take his Class 10 board exam, for the 47th time. Shiv Charan Yadav, from Khohari village in Alwae, first took the exam in 1968.

47వ సారి పదో తరగతి పరీక్షలు రాస్తున్న 77 ఏళ్ల విద్యార్థి

Posted: 03/04/2016 12:42 PM IST
77 year old set for 47th shot at class 10 exam

టిప్పు సుల్తాన్ దండయాత్రలా ఓ వ్యక్తి పదో తరగతి పరీక్షలు పాస్ కావడానికి దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికి 47 సార్లు అలా దండయాత్ర చేసినా కూడా అలిసిపోకుండా ఇంకా చేస్తూనే ఉన్నారు. అవను.. పదో తరగతి పరీక్ష పాస్ కావడానికి ఆ వ్యక్తి గత 47 సంవత్సరాల నుండి కష్టపడుతూనే ఉన్నాడు. రాజస్థాన్ రాష్ట్రం కోహారీ గ్రామానికి చెందిన 77 ఏళ్ల వృద్ధుడు శివ చరణ్ యాదవ్ 1968 నుంచి పది పరీక్షలు రాస్తున్నాడు. గతేడాది వరకు 47 సార్లు పరీక్షలు రాశాడు. కానీ ఉత్తీర్ణత కావడం లేదు. 46 సంవత్సరాల వయస్సున్నప్పుడు ఈ పెద్దాయన ఓ ప్రతిజ్ఞ చేశాడు. పది పాస్ అయ్యే వరకు పెళ్లి చేసుకోనని ప్రతినబూనాడు.

ఇక ఏడాది ఆయన పది పరీక్షలు రాయడం 48వ సారి. ఈ సారి పది పరీక్షలు పాస్ అయ్యేందుకు ఇద్దరు టీచర్లతో పాఠాలు కూడా చెప్పించుకున్నాడు. ఈ ఏడాది పదిలో ఉత్తీర్ణుడినై.. వివాహానికి అర్హత సాధిస్తానని చెప్పుకొచ్చారు. పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశాడు. ఇక 30 ఏళ్ల నుంచి ఈయన ఒంటరిగా జీవిస్తున్నాడు. రెండు నెలల వయసున్నప్పుడే అమ్మ.. పదేళ్ల వయస్సున్నపడు తండ్రి చనిపోయాడు. అయితే ఈ 77 ఏళ్ల వృద్ధుడిని చూసి కొందరు నవ్వుకుంటారు. మరికొందరు ప్రోత్సహిస్తుంటారు. ఇంకొందరు పుస్తకాలు, పెన్నులు బహుమానంగా ఇస్తుంటారు. ఎంతైనా ఈయన సంకల్పం ముందు ఎంతటి సమస్యైనా తలవంచాల్సిందే. మరి ఈ తాతయ్యకు ఆల్ బిస్ట్ చెబుదాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajasthan  10th Exam  Student  Shiv shankar Yadav  

Other Articles