SBI wants Vijay Mallya arrested, his passport seized in Kingfisher loan default case

Sbi seeks mallya s arrest in loan default case

kingfisher, vijay mallya, kingfisher loan recovery, kingfisher airlines, kingfisher debt cbi, kingfisher house auction, State Bank of India, Diageo, Vijay Mallya, United Breweries, business news, india news

Top state-run lender SBI sought arrest of Vijay Mallya, and also impounding of his passport, as the bank approached Debt Recovery Tribunal seeking action for defaulting on loans.

విజయ్ మాల్యా అరెస్టు కోరుతూ కోర్టును ఆశ్రయించిన ఎస్బీఐ..

Posted: 03/03/2016 03:09 PM IST
Sbi seeks mallya s arrest in loan default case

వ్యాపారాల పేరిట పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి వేలాది కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకుని డిఫాల్టర్ గా తేలిన యునైటెడ్ బ్రూవరీస్ ప్రమోటర్ విజయ్ మాల్యాపై ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడంతో సీబిఐ డైరెక్టర్ అనీల్ సిన్హా బ్యాంకులను తప్పబట్టారు. గత ఏడాది తాము 20 వేల 646 కోట్ల రూపాయల రుణాలను తీసుకుని డీఫాల్టర్ గా మారిన 171 కేసులను విచారించామని అయితే అందులో సుమోటోగా తీసుకున్న కేసు విజయ్ మాల్యాదని ఆయన చెప్పారు.

7 వేల కోట్ల రూపాయల మేర బ్యాంకుల నుండి రుణాలను పొందిన ఆయన తన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ను ఇటీవలే డియాజియోకు విక్రయించి, అందుకు ప్రతిఫలంగా రూ.515 కోట్లను బహుమానంగా అందుకుని లండన్ వెళ్తున్నారని వార్తలు వస్తున్నా ఇప్పటికీ బ్యాంకులు  స్పందిచలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో అతనిపై చర్యలకు బ్యాంకింగ్ రంగ దిగ్గజం కదిలింది. ఈ క్రమంలో మాల్యా సంస్థలకు భారీ ఎత్తున రుణాలిచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మేల్కొంది. తన వద్ద రుణాలు తీసుకుని, వాటిని ఎగవేసి విదేశాలకు పారిపోతున్న మాల్యాను అరెస్ట్ చేయాలని ఆ బ్యాంకు నిన్న డెబిట్ రికవరీ ట్రైబ్యునల్ (డీఆర్టీ)ని ఆశ్రయించింది.

ఎస్బీఐ నేతృత్వంలోని పలు బ్యాంకులు... మాల్యా ఆధ్వర్యంలోని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు రూ.7,800 కోట్ల మేర రుణాలిచ్చాయి. వీటిని తీర్చడంలో విఫలమైన మాల్యాను ఇప్పటికే బ్యాంకులు ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారు (విల్ ఫుల్ డిఫాల్టర్)’ గా ప్రకటించాయి. మాల్యా లండన్ లో స్థిరపడనున్నారన్న వార్తల నేపథ్యంలో ఎస్బీఐ ఈ పిటిషన్లను దాఖలు చేసింది. మాల్యా పాస్ పోర్టును స్వాధీనం చేసుకోవాలని, డియాజియా నుండి మాల్యాకు లభించే పరిహారం నిధులను ముందుగా తమకు దఖలుపరచడంతో పాటు విదేశాల్లోని మాల్యా ఆస్తుల వివరాలన్నిటినీ వెల్లడయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని ఎస్బీఐ తన పిటిషన్లలో కోరింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : State Bank of India  Diageo  Vijay Mallya  Kingfisher Airlines  United Breweries  

Other Articles