Freedom 251: Oh No! Ringing Bells' Noida office found closed

Ringing bells noida office found closed

freedom 251, buy freedom 251, freedom 251 website crash, freedom 251 registrations, ringing bells fraud, Cyfuture, Freedom 251, Freedom 251 refund, Mohit Goel, Ringing Bells refund, Enforcement Directorate, ED question, Freedom 251 smartphone, Ringing bells office close, ringing bells money refund, freedom 251 smartphone features

The office of Ringing Bells –manufacturing company of India's cheapest smartphone Freedom 251 was found closed, fueling a lot of speculations on the genuinity of its business.

ఫ్రీడమ్ 251 ఫోన్ కు సంబంధించిన మరో ఆసక్తికర అంశం.. మీకు తెలుసా..?

Posted: 03/03/2016 03:07 PM IST
Ringing bells noida office found closed

ఫ్రీడమ్ 251 పేరుతో అత్యంత చౌక ధరకు స్మార్ట్ఫోన్ అందిస్తామన్న ప్రచారంతో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంస్థ రింగింగ్ బెల్స్ కు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశాన్ని జాతీయ మీడియా వెలుగులోకి తీసుకోచ్చాయి. ఫ్రీడమ్ ఫోన్ల తయారీ సంస్థ రింగింగ్ బెల్స్కు సంబంధించిన నోయిడా కార్యాలయం మూసివేసి ఉన్నట్లు ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. ఆఫీస్కు సంబంధించిన అద్దెను చెల్లించడంలో విఫలమైనందున  ఆ కార్యాలయానికి తాళాలు పడినట్లు తెలుస్తోంది.

అయితే రింగింగ్ బెల్స్ సంస్థ ప్రెసిడెంట్ అశోక్ చద్దా మాత్రం తాము పూర్తి స్థాయిలో వ్యాపారానికి కట్టుబడి ఉన్నామని, ఎక్కడికి పారిపోవడం లేదని వెల్లడించారు. రింగింగ్ బెల్స్ సంస్థ సీఈవో మోహిత్ గోయల్ను ఫ్రీడమ్ 251 మొబైల్ ధరను గురించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ప్రశ్నించారు. మొబైల్ల కోసం ఆన్లైన్లో బుక్  చేసుకున్న కస్టమర్ల డబ్బు విషయంలోనూ ఈడీ విచారణ చేపట్టినట్లు సమాచారం. దిగ్గజ సంస్థలకు సైతం సాధ్యం కానటువంటి అత్యంత చౌకయిన ధరకు స్మార్ట్ మొబైల్ను అందిస్తామంటూ రింగింగ్ బెల్స్ ముందుకు రావడంతో ఈ సంస్థపై ఇప్పటికే ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

కాగా ఈ నేపథ్యంలో ఆఫీసును మూసేశారన్న వార్తలు మరింత కలకలం సృష్టిస్తున్నాయి. కార్యాలయం అద్దెనే చెల్లించలేని సంస్థ అత్యంత తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్ లను ఎలా అందిస్తున్న సందేహాలు రెకెత్తున్నాయి. సుమారుగా కోట్ల సంఖ్యలో ఫోన్లను ఎలా తయారు చేస్తారన్న అంశంపై కూడా సంబంధిత అధికారులు రింగింగ్ బెల్స్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే రింగింగ్ బెల్స్ యాజమాన్యం ఆన్ లైన్ ద్వారా ఫోన్లను బుక్ చేసుకున్న వారికి వారి డబ్బలును చెల్లించేస్తున్నాయి.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Freedom 251  Ringing Bells  noida office  closed  

Other Articles