Petrol price cut by Rs 3.02, diesel increased by Rs 1.47 per litre

Petrol price cut by rs 3 diesel costlier by rs 1 47

Petrol,Petrol price,Diesel,Diesel price,Oil market,Oil prices,Global oil prices,Brent crude oil price,Rupee vs dollar

In good news for consumers, price of petrol was lowered by Rs. 3.02 per litre on Monday. Diesel, however, was raised by Rs. 1.47 per litre. Revised prices will take effect from the midnight of February 29 and March 1.

రూ.3 మేర తగ్గిన పెట్రోల్ ధర.. డీజిల్ ధరకు రెక్కలు

Posted: 02/29/2016 06:48 PM IST
Petrol price cut by rs 3 diesel costlier by rs 1 47

వాహన చోదకులకు ఇంధన సంస్థలు శుభవార్తను అందించాయి. పెట్రోల్ ధరలు ఈ సారి భారీగా తగ్గాయి. అంతర్జాతీయ చమురు ధరలను అనుసరించి పక్షం రోజులకో పర్యాయం ఇంధన ధరలపై సమీక్షిస్తున్న చమురు సంస్థలు ఈసారి  పెట్రోల్ ధరను ఒక లీటరుకు రూ.3.02 వంతున తగ్గించేశాయి. గడిచిన మూడేళ్లల్లో ఒకేసారి ధరను ఇంత మొత్తంలో తగ్గించడం ఇదే మొదటిసారి. అయితే అయిల్ కంపెనీలు పెట్రోల్ వాహనదారులకు అందించిన తీపికబురును కేంద్రప్రభుత్వం వుండనిస్తుందా..? లేక ఎక్సైజ్ సుంఖం పెంపుతో ఆ సంతోషాన్ని అవిరి చేస్తుందా..? అన్నది వేచి చూడాల్సింది. కేంద్రం పెట్రోల్ ధరపై ఎలాంటి పన్ను విధించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తో వాటిని అవిరి చేస్తాయా..? అన్న సందిగ్ధత కూడా వాహనదారులలో నెలకోంది.

కాగా, పెట్రోల్ వాహదారులకు తీపి కబురునందిచిన ఆయుల్ కంపెనీలు డీజిల్ వాహనదారులకు మాత్రం షాక్ ఇచ్చాయి. డీజిల్ పై రూ 1.47ను పెంపును విధించాయి. సవరించిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమలవుతాయని కంపెనీలు పేర్కొన్నాయి. కాగా కొత్త ధరలను బట్టి చూస్తే హైదరాబాద్ లో ఒక లీటరు పెట్రోలు రూ.63.84 నుంచి  రూ. 60.82 పైసలకు తగ్గగా, డీజిల్  ధర రూ. 48.44 నుంచి రూ. 49.91కు పెరిగింది. చివరిసారిగా ఫిబ్రవరి 17న ధరలను సవరించిన కంపెనీలు.. పెట్రోల్ పై 3 పైసలు, డీజిల్ పై 3 పైసలు తగ్గించిన విషయం తెలిసిందే.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol price  cut  diesel rate  hike  oil companies  crude oil  

Other Articles