husband whatapp message to wife, look iam with my girlfriend

Husband sends intimate photos with girl friend to wif

Ibrahim Rizwan, whats app, Police, wife, girl friend, husband defends divorce, wife whats app, husband intimate scenes, husband romance with girl friend, whats app, Police, wife, girl friend

husband Ibrahim Rizwan demands divorce from his wife, sends intimate photos with girl friend through whatsapp

విడాకుల కోసం భార్యకు ‘ఆ’ ఫోటలను పంపిన భర్త

Posted: 02/28/2016 10:57 AM IST
Husband sends intimate photos with girl friend to wif

నీవెక్కడ ఉన్నావంటూ ఫోన్ చేసిన భార్యకు ఓ భర్త ఏకంగా తన ప్రేయసితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వాట్సాప్ ద్వారా పంపాడు. అంతటితో ఆగకుండా విడాకులివ్వాలని డిమాండ్ చేస్తూ రెండో పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు. అప్రమత్తమైన భార్య అతడి రెండో వివాహ నిశ్చితార్థాన్ని అడ్డుకుంది. బెంగళూరులో జరిగిన ఈ ఘటన శనివారం వెలుగుచూసింది. నగరంలోని శ్యాంపురలో ఉంటున్న ఇబ్రహీం రిజ్వాన్, తహసీన్‌లకు ఐదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు.

రెండేళ్లు సజావుగా సాగిన వీరి సంసారంలో కలతలు మొదలయ్యాయి. ఇబ్రహీం రిజ్వాన్‌కు స్థానికంగా ఉంటున్న మరో యువతితో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. అప్పటి నుంచి ఇబ్రహీం రిజ్వాన్ ఇంటికి సరిగా వచ్చేవాడు కాదు. ఈ క్రమంలోనే ఈనెల 19న తహసీన్ భర్తకు ఫోన్ చేసి ఎక్కడున్నావని ప్రశ్నించింది. నేను ఎక్కడున్నానో చూడు అంటూ ఆ యువతితో సన్నిహితంగా ఉంటున్న ఫొటోలను, వీడియోలను వాట్సప్‌లో భార్యకు పంపించాడు.

ఈ పరిణామంతో భయపడిన తహసీన్ తన తల్లిదండ్రులు, బంధువులతో కలసి సదరు యువతి ఇంటికి వెళ్లారు. అప్పుడే ఆ యువతితో ఇబ్రహీం రిజ్వాన్‌కు నిశ్చితార్థం జరుగుతోంది. దీంతో తహసీన్ తన భర్త, ఆ యువతితో వాగ్వాదానికి దిగడమే కాకుండా పోలీసులకు సమాచారం అందజేశారు. ఇబ్రహీం రిజ్వాన్ ఆ యువతితో కలసి పరారయ్యాడు. తనను మోసం చేసి భర్త మరో యువతితో వివాహానికి సిద్ధమవుతున్నాడని తహసీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ibrahim Rizwan  whats app  Police  wife  girl friend  

Other Articles