Thane shocker: Man kills 14 family members, commits suicide

Man kills 14 family members in cold blood commits suicide

thane, thane murder, thane killing, thane crime, thane 14 murdered, thane man kills family, thane news, mumbai news, mumbai murder, 14 people murdered, Kasarwadi area Thane, Maharashtra,

A woman who was also attacked by Warerkar has survived and is currently undergoing treatment at a hospital.

మహారాష్ట్రలో నరమేథం.. కుటుంబసభ్యులను చంపి వ్యక్తి ఆత్మహత్య

Posted: 02/28/2016 11:33 AM IST
Man kills 14 family members in cold blood commits suicide

మహారాష్ట్రలో 14 మంది దారుణ హత్యకు గురయ్యారు. థానే నగరంకు సమీపంలోని కాసర్ వాది ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఓ వ్యక్తి తన కుటుంబంలోని 14 మందిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కత్తితో గొంతులు కోసి కిరాతకంగా చంపాడు. ఈ దారుణ ఘటన నుంచి ఓ మహిళ ప్రాణాలతో బయటపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హంతకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

చేతిలో కత్తి ఉండడంతో అతడే ఈ హత్యలు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు దారి తీసిన పరిస్థితుల గురించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడు ఎందుకు ఈ కిరాతానికి పాల్పడ్డాడో తెలియరాలేదని థానే సంయుక్త పోలీసు కమిషనర్ అశుతోష్ డుమ్రీ చెప్పారు. ఒక మహిళ ప్రాణాలతో బయటపడ్డారని వెల్లించారు. షాక్ నుంచి తేరుకోనందున ఆమెను ఇంకా ప్రశ్నించలేదని తెలిపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 14 people murdered  Kasarwadi area Thane  Maharashtra  

Other Articles