Opposition demand to apology for Smriti Irani statements

Opposition demand to apology for smriti irani statements

Smriti Irani, Parliament, JNU, HCU

Union Minister Smriti Irani today said she was a "practising Hindu and Goddess Durga worshipper" while the opposition aggressively demanded her apology in the Rajya Sabha for reading out controversial references to the deity yesterday.

స్మృతి ఇరానీ క్షమాపణలు చెప్పాలట..!

Posted: 02/26/2016 02:47 PM IST
Opposition demand to apology for smriti irani statements

రాజ్యసభలో జేఎన్‌యూ వివాదంపై మరింత వేడి రాజుకుంది.  జేఎన్‌యూపై చర్చ సందర్భంగా గురువారం కేంద్ర మానవవనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. స్మృతి ఇరానీ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని బీఎస్పీ నేత మాయావతి పట్టుబట్టారు. దీనికి విపక్షాలన్నీ మాయావతికి మద్దతు పలికాయి. స్మృతి ఇరానీ దుర్గాదేవిని అవమానించారని విపక్షాలు ఆరోపించాయి. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ఈ అంశంపై ఆమె రాజ్యసభలో జోక్యం చేసుకుని తన అభిప్రాయాన్ని వినిపించారు. ‘నేను హిందువును... దుర్గాదేవి భక్తురాలిని’అని స్పష్టం చేశారు. తాను స్వయంగా హిందూ మతాన్ని ఆచరిస్తున్నట్లు తెలిపారు. జేఎన్‌యూ డాక్యుమెంట్ ఆధారంగానే తాను అక్కడి విద్యార్థులు నిర్వహించిన మహిషాసుర సంబరాలను వెల్లడించినట్లు ఆమె చెప్పారు. ఆ డాక్యుమెంట్‌ను చదువుతుంటే తాను ఎంతో బాధకు గురైనట్లు ఆమె తెలిపారు.

పార్లమెంట్ ప్రారంభమైన వెంటనే రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలకు గానూ  స్మృతి ఇరానీ క్షమాపణలు చెప్పాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్ సభ్యులు ఆనంద్ శర్మ, గులాంనబీ ఆజాద్‌ తదితరులు ఆ విషయంపై గట్టిగా డిమాండ్ చేశారు. దీనిపై కలగజేసుకున్న స్మృతి ఇరానీ తాను దుర్గామాత భక్తురాలినని తాను చదివిన డాక్యమెంట్లన్నీ సరైనవేనని మంత్రి స్పష్టం చేశారు. వాస్తవాలు చెప్పాలనే తాను ఆ డాక్యుమెంట్లనీ చదివానన్నారు. దుర్గాదేవి గురించి జేఎన్‌యూలో అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారని, కరపత్రాలు పంచారని అంటూ వాటిని చూపించారు. దీంతో ఆమె వ్యాఖ్యలపై ప్రతిపక్షసభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సభకు సంబంధం లేని అంశాలను ఇక్కడ ప్రస్తావించరాదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Smriti Irani  Parliament  JNU  HCU  

Other Articles