అగ్రరాజ్యం అమెరికావాసులలో నానాటికీ హింసా ప్రవృత్తి పెరుగుతుంది. నడిరోడ్డు మీద తుపాకీ పట్టుకు తిరిగినా తప్పులేదన్న చట్టాలు.. అక్కడి వారి అమయాక ప్రాణాలను హరించివేస్తున్నాయి, తాజాగా కొద్దిసేపటి క్రితం మరోమారు కాల్పుల కలకలం చోటుచేసుకుంది. తుపాకీ చేతబట్టి రంగప్రవేశం చేసిన ఓ సాయుధ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు పౌరులు అక్కడికక్కడే చనిపోగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
వివరాల్లోకెళితే... కన్సాస్ లోని హెస్టాన్ ఏరియాలోని లాన్ కేర్ పరిశ్రమ ఎక్సెల్ ఇండస్ట్రీస్ లో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న సెడ్రిక్ ఫార్డ్ అనే వ్యక్తి అక్కడి కాలమానం ప్రకారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తన వద్ద నున్న రెండు ఆయుధాలతో అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడు. ఒక చేత్తో ఏకే 47 ఆయుధంతో అత్యంత వేగంగా బుల్లెట్లు దూసుకువస్తుండగా, మరో పోడవాటి 9 ఎంఎం రైఫిల్ ను మరో చేత్తో పట్టుకుని పరిశ్రమలో హింసాయుత వాతావరణాన్ని సృష్టించాడు. ఊహించని ఈ పరిణామానికి భయకంపితులైన పరిశ్రమలోని మిగతా కార్మికులు తమ ప్రాణాలు దక్కితే చాలనుకుని పరుగులు తీశారు.
సాయుధ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో అప్పటికే నలుగ్గురు వ్యక్తులు నేలకొరిగారు. 20 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగారు. రమారమి అరగంటలోపు అక్కడికి చేరుకున్న పోలీసులు దుండగుడిని మట్టుబెట్టేశారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాల్పులకు తెగబడ్డ దుండగుడు సెడ్రిక్ ఫోర్డ్ కు అప్పటికే నేర చరిత్ర వుందని, అతని ఫేస్ బుక్ పేజీలో కూడా పలు రకాల అయుధాలు దర్శనమిస్తున్నాయని అమెరికా పోలీసులు తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more