Railway Minister Suresh Prabhu said that circute rails for Thirupathi

Railway minister suresh prabhu said that circute rails for thirupathi

Ap, Thirupati, Vijayawada, Railway Budget, Railway Budget 2016-17

Railway Minister Suresh Prabhu said that circute rails for Thirupathi. He also said that railway connectivity for ap will get develpment of ap

తిరుపతికి సర్క్యూట్ రైళ్లు.. ఏపి బడ్జెట్ లో కొన్ని వరాలు

Posted: 02/25/2016 01:33 PM IST
Railway minister suresh prabhu said that circute rails for thirupathi

తిరుపతి లాంటి యాత్ర స్థలాలకు సర్క్యూట్‌ రైళ్లు ఏర్పాటు చేస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు తెలిపారు. గురువారం మధ్యహ్నం 12 గంటలకు పార్లమెంటులో రైల్వే బడ్జెట్‌ను సురేష్ ప్రభు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్లలో ఎఫ్ఎం రేడియో సేవలను ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి హైదరాబాద్‌లో సబ్‌ అర్బన్‌ నెట్‌వర్క్‌ విస్తృతికి చర్యలు చేపడతామని సురేష్ ప్రభు చెప్పారు. రైల్వే కోచ్‌లలో ఇకపై జీపీఎస్‌ సిస్టం ఏర్పాటు చేస్తామని ప్రభు తెలిపారు.

నాగ్‌పూర్‌- విజయవాడ ట్రేడ్‌ కారిడార్‌ పూర్తి చేస్తామని రైల్వేమంత్రి సురేష్ ప్రభు అన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు రైల్వే బడ్జెట్ లో సముచిత ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. అంతేకాకుండా దేశంలో ప్రధాన పోర్టులకు రైల్వే కనెక్టివిటీ పెంచుతామని సురేష్‌ ప్రభు చెప్పారు. ఈ రైల్వే కనెక్టివిటీ ద్వారా ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. ఈ చర్యల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ap  Thirupati  Vijayawada  Railway Budget  Railway Budget 2016-17  

Other Articles