Railway Minister Suresh Prabhu about a lady

Railway minister suresh prabhu about a lady

Railways, Suresh Ptrabhu, Railway Budget, Railway Budget 2016-17

Railway Minister Suresh Prabhu about a lady who served in the Mumbai central Railway station. He said that every one feeling railways is ours

ఆమె ఏం చేసిందో చెప్పిన రైల్వే మంత్రి

Posted: 02/25/2016 01:25 PM IST
Railway minister suresh prabhu about a lady

రైల్వే మంత్రి సురేష్ ప్రభు కొద్ది సేపటి క్రితం రైల్వే బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. అయితే తన బడ్జెట్  ప్రసంగంలో భాగంగా ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో మహిళ గురించి ప్రస్తావించారు. రైల్వే మంత్రిగా తాను చాలా ప్రాంతాలకు వెళ్లి చాలామందిని కలిశానని, అందులో భాగంగానే ముంబై సెంట్రల్ కు వెళ్లినప్పుడు ఓ మహిళ అక్కడి స్టేషన్‌ను శుభ్రం చేస్తున్నారని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. గురువారం లోక్‌సభలో 2016 సంవత్సరానికి గాను రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయనీ విషయం చెప్పారు. గత 5 నెలలుగా ఆమె స్వచ్ఛందంగా ఈ సేవలు చేస్తున్నారని, ప్రజల్లో ప్రతి ఒక్కరూ రైల్వేలను తమ సొంత సంస్థ అనుకోవడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు.

రైల్వేల సేవలను టెక్నాలజీకి అనుసందానం చేస్తున్న రైల్వే మంత్రిత్వ శాఖ 2016-17 బడ్జెట్ మీద ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంది. అందులో భాగంగా సురేష్ ప్రభు సోషల్ మీడియాలో కూడా సలహాలు, సూచనలు తీసుకున్నట్లు వెల్లడించారు. రైల్వే కుటుంబంలోని ప్రతి ఒక్క సభ్యుడి ఆశలు, ఆకాంక్షలను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుందని తెలిపారు. రైల్వేలు అందరివీ.. అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఆదాయాన్ని పెంచుకోవడంపై రైల్వేశాఖ దృష్టిపెట్టిందని, కొత్త వనరులవైపు దృష్టి సారిస్తున్నామని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Railways  Suresh Ptrabhu  Railway Budget  Railway Budget 2016-17  

Other Articles