Railway Minister Suresh Prabhu said that no hike in railway tickets

Railway minister suresh prabhu said that no hike in railway tickets

Railways, Suresh Ptrabhu, Railway Budget, Railway Budget 2016-17

Railway Minister Suresh Prabhu said that no hike in railway tickets. He that the Railways will going to gain profit with out any hike in charges

రైల్వే ఛార్జీలు పెరగడం లేదు

Posted: 02/25/2016 01:01 PM IST
Railway minister suresh prabhu said that no hike in railway tickets

రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు కొద్దిసేపటి క్రితం 2016-17 సంవత్సరానికి గాను రైల్వే బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. రైల్వే ప్రస్తుతం అందిస్తున్న సేవలను, సౌకర్యాలను మరింత పెంచుతామని కూడా ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ప్యాసింజర్ రైళ్ల సగటు వేగాన్ని అరవై కిలోమీటర్లకు పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు.  స్వయం సంమృద్దితో రైల్వేలు ఎదిగేలా చేస్తామని అన్నారు. చార్జీలు పెంచితేనే ఆదాయం కాకుండా, ప్రత్యమ్నాయలు కోసం అన్వేషణ

రైల్వే బడ్జెట్ లోని ముఖ్యాంశాలు..

* వచ్చే ఏడాది 50 శాతం రైల్వేలైన్లు విద్యుద్దీకరణ
* 2016-17 ఆదాయ లక్ష్యం 1.87 కోట్ల లక్ష్యం
* సేవల నుంచి సౌకర్యాల వరకూ మరింత మెరుగు
*1.50 లక్షల కోట్లను ఎల్ఐసీ పెట్టుబడి పెడుతోంది
*ఈ ఏడాది 2800 కిలోమీటర్ల ట్రాక్‌ను బ్రాడ్ గేజ్‌గా మారుస్తాం
*రోజుకు 7 కిలోమీటర్ల చొప్పున వీటిని మారుస్తాం. ప్రస్తుతం ఇది 4.8గా ఉంది
*9 కోట్ల మ్యాన్‌డేస్ ఉపాధి కల్పిస్తాం
*రైల్వే మార్గాల విద్యుదీకరణ వల్ల ఖర్చు బాగా తగ్గుతుంది
*ప్యాసింజర్ రైళ్ల సగటు వేగం 60 కిలోమీటర్లు
*ఎక్స్‌ప్రెస్ వేగం 80 కిలోమీటర్లు
*2020 నాటికి దీర్ఘకాల కోరికలు తీరుస్తాం
*ఆన్ డిమాండ్ రైళ్లను కల్పిస్తాం
* సేఫ్టీ కోసం హై ఎండ్ టెక్నాలజీ
*అన్ మ్యాన్డ్‌ రైల్వే క్రాసింగులను తీసేయాలి
* రైళ్ల వేగాన్ని మరింతగా పెంచుతాం
* స్వయం సంవృద్ధితో రైల్వేలు
* చార్జీలు పెంచితేనే ఆదాయం కాకుండా, ప్రత్యమ్నాయలు కోసం అన్వేషణ
* గత ఏడాది రూ.8724 కోట్లు ఆదా చేశాం
* రైల్వేలను సరికొత్తగా తీర్చిదిద్దుతాం
* ఈ ఏడాది రెవెన్యూ లోటును తగ్గించగలిగాం
* అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే  పనితీరును మెరుగు పరుస్తున్నాం
* వచ్చే ఏడాది 10 శాతం ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్నాం
* ఆదాయ మార్గాల పెంపును అన్వేషిస్తున్నాం
*  ప్రధాని మోదీ విజన్ కు అనుగుణంగా రైల్వే బడ్జెట్
* ఇది నా ఒక్కడిదీ కాదు....ప్రతి పౌరుడి బడ్జెట్
* సామాన్యుల ఆశలు ప్రతిబింబించేలా రైల్వే బడ్జెట్ రూపొందించాం
* దేశాభివృద్ధికి రైల్వే వెన్నెముకలా ఉండేలా రైల్వే బడ్జెట్
* తన ప్రసంగంలో వాజ్పేయి కవితను చదవి వినిపించిన సురేశ్ ప్రభు
*  రైల్వేలో కొత్త ఆలోచన, కొత్త ఆదాయాలకు ప్రతిపాదికన బడ్జెట్

(Source: sakshi)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Railways  Suresh Ptrabhu  Railway Budget  Railway Budget 2016-17  

Other Articles