Maharastra governmenttallots over 600 acres of land for Baba Ramdev’s Patanjali

After haryana maharastra government allots land to baba ramdev

Patanjali, Baba Ramdev, yoga guru.600 land, maharastra, devendra fadnavvis, haryana, brand ambassodor, maharastra chief minister, medical herbs, ayurvedic products

The Maharashtra state government has allotted more than 600 acres of land to the Patanajli Yogpeeth, run by yoga guru Baba Ramdev, for setting up an orange processing plant and units for its ayurvedic products.

హర్యానా తరువాత మహారాష్ట్ర.. బాబా పట్ల భక్తి చాటుకుంటున్న ప్రభుత్వాలు

Posted: 02/23/2016 04:50 PM IST
After haryana maharastra government allots land to baba ramdev

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే అయనకు పద్మ పురస్కారంతో సత్కరించాలనుకుంది. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తగానే.. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న కేంద్రం.. మొత్తానికి బీజేపి అధికారంలో వున్న రాష్ట్రాల్లో మాత్రం ఆయన పట్ల భక్తిని చాటుకుంటుంది. హర్యానా రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా ఆయనను సత్కారించిన హర్యానా ప్రభుత్వం.. ఆయనకు వందల ఏకరాలను దారాదత్తం చేసింది. ఆయన పతాంజలి సంస్థ తయారు చేయు ఔషధ మొక్కలు పెంపకానికని మరీ ప్రకటించారు. హర్యానా తరువాత ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన పట్ల స్వామి భక్తిని చాటుకుంది. ఇంతకీ ఈ ఉపోద్ఘాతమంతా ఎవరి కోసమో తెలుసా..?

యెగాగురు బాబా రాందేవ్‌ గురించి. ఎందుకంటే మహారాష్ట్ర ప్రభుత్వం 600 ఎకరాల భూమిని ఆయనకు తాజాగా ధారాదత్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. రాందేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న 'పతంజలి యోగపీఠ్ ' సంస్థకు ఈ  స్థలాన్ని కేటాయించింది. ఆయుర్వేద మందుల తయారీకి పయోగించే ఔషధ మొక్కల పెంపకానికి అవసరమైన ప్రాసెసింగ్ ప్లాంట్ కోసం ఈ భూమిని వినియోగించనున్నారు.  నాగ్పూర్ ఎంపీ, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్రమంత్రి చంద్రశేఖర్, యోగపీఠ్ ప్రతినిధులు సమక్షంలో ఒప్పంద పత్రాలపై  సంతకాలు జరిగాయి. నాగపూర్ జిల్లా కోటాల్ లో 200, ప్రాసెసింగ్ ప్లాంట్ కోసం మిహాన్ సెజ్లో మరో 450  ఎకరాల భూమిని రాందేవ్ బాబాకు అప్పగించారు.

ప్రకృతి వనరులు, మందుల వినియోగంపై పరిశోధన కోసం ఈ భూమిని బాబాకు  కేటాయించామని కేంద్ర మంత్రి ప్రకటించారు. దీనిద్వారా  మావోయిస్టుల ప్రభావిత జిల్లా గడ్చిరోలిలో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయన్నారు. ముఖ్యంగా  విదర్భలోని గిరిజన ప్రాంతాలు, రిమోట్ భూభాగాల్లో విస్తారంగా కనిపించే సహజ మందులు, వాటి మూలాలపై పరిశోధనకు ఈ భూమి  ఉపయోగిస్తారని తెలిపారు. అయితే వివాదాస్పద యోగా గురుకు వందల ఎకరాల స్థలాలను కట్టబెట్టడంపై విమర్శలు  చెలరేగాయి. భారీ పెట్టుబడులకు  ఉద్దేశించిన సెజ్  భూమిని ఇలా బాబాలకు ఇవ్వడమేంటని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వానికి  నిజంగా అటవీ ఉత్పత్తులను ప్రోత్సహించే ఉద్దేశముంటే  టెండర్లను ఎందుకు పిలవలేదని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. అటవీ భూములను అన్యాక్రాంతం చేయడానికి  బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగా ఈ కేటాయింపులు చేశారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ఆరోపించారు.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Patanjali  Baba Ramdev  yoga guru.600 land  maharastra  devendra fadnavvis  

Other Articles