YSRCP MLA Roja slams Chandrababu over party defections

Ysrcp mla roja slams chandrababu over party defections

Roja, YSRCP, Bhuma NagiReddy, TDP, Chandrababu, Jagan

In the wake of five YSR Congress party leaders switching loyalties and joining the Telugu Desam party, YSRCP MLA Roja came down heavily against TDP President and Chief Minister Chandrababu Naidu.

అభివృద్ది చూశారని వచ్చారనటం సిగ్గుచేటు

Posted: 02/23/2016 04:49 PM IST
Ysrcp mla roja slams chandrababu over party defections

వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే  రోజా మరోసారి ఏపి సిఎం చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేశారు. తాజాగా భూమా నాగిరెడ్డితో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు టిడిపి తీర్థం పుచ్చకోవడం మీద ఆమె స్పందించారు. టీఆర్ఎస్‌లోకి టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్తే నైతిక విలువలు లేవన్న చంద్రబాబు ఇప్పుడు ఏం చేశారని ఈ సందర్భంగా రోజా ప్రశ్నించారు. మునిగిపోయే పడవ లాంటి టీడీపీలోకి ఎమ్మెల్యేలు వెళ్లారంటే.. ఏదో ప్రయోజనం ఆశించి వెళ్లి ఉంటారని ఆరోపించారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికలకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. నలుగురు ఎమ్మెల్యే పోయినంత మాత్రాన వైఎస్ఆర్ సీపీ బెదిరేది లేదని పేర్కొన్నారు.

వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భూమా నాగిరెడ్డికి సంకెళ్లు వేసి కూర్చోబెట్టారని.. . ప్రస్తుతం షేక్ హ్యాండ్ ఇచ్చి, చంద్రబాబు కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారన్నారు. శోభా నాగిరెడ్డికి కనీసం సంతాపం తెలిపలేదని.. అంతా తెలిసి కూడా ఆమె భర్త, కూతురు అధికార టీడీపీలో చేరడాన్ని తప్పుబట్టారు. తమ పార్టీ చేసిన అభివృద్ది చూసి వస్తున్నారని అధికార పార్టీ వారు చెప్పడం నిజంగా సిగ్గుచేటని రోజా అన్నారు. అసలు టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటని ఈ సందర్భంగా రోజా ధ్వజమెత్తారు. ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని, రైతులు, చేనేత కార్మికులకు రుణమాఫీ చేయలేదని వివరించారు.

మొదటి నుంచి కూడా బాబుకు రాజకీయాలను భ్రష్టు పట్టించడం అలవాటు అని.. అందులో భాగంగానే తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయాడని ఆరోపించారు. అందుకే అక్కడ టీడీపీ సీన్ రివర్స్ అయిందన్నారు. ఈ పార్టీ వాళ్లు టీఆర్ఎస్ లో చేరితో సంతలో పశువుల్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారంటూ టీఆర్ఎస్ పార్టీని విమర్శించిన చంద్రబాబు ఈ రోజు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా, టీడీపీ నుంచి ఎన్నికల్లో నిలబెట్టకుండానే పార్టీలో ఏ విధంగా చేర్చుకున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. రాజధాని రైతుల భూములను దోచుకుని, సింగపూర్ బృందం చేతికి అప్పగించి అభివృద్ధి చేస్తామని చెప్పిన చంద్రబాబు... టీడీపీ నేతలు, తన సన్నిహితులకు ఆ భూములను కట్టబెట్టడం దారుణమంటూ మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  YSRCP  Bhuma NagiReddy  TDP  Chandrababu  Jagan  

Other Articles