In Medak Dist villagers decided to join kids into govt schools only

In medak dist villagers decided to join kids into govt schools only

Medak, Govt schools, Telangana

In Medak Dist villagers decided to join kids into govt schools only. The Villagers decided to join their kids into govt schools in Naskal panchayath area.

ఆ ఊర్లో పిల్లలను సర్కారీ స్కూల్లకే పంపుతారు. ఎందుకంటే

Posted: 02/23/2016 11:26 AM IST
In medak dist villagers decided to join kids into govt schools only

స్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించాలంటే తల్లిదండ్రులకు చాళా భయం.. అక్కడ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం జరగదు అని చాలా మంది భావన. అయితే తెలంగాణలోని ఐదు గ్రామ ప్రజలు మాత్రం తమ పిల్లలను కేవలం ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని తీర్మానించారు. ఈ తీర్మానానికి కట్టుబడి ఈ ఐదు గ్రామాల విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పాఠశాలల గడప తొక్కరు. మెదక్‌జిల్లా రామాయంపేట మండలం నస్కల్ గ్రామ పంచాయతీ పరిధిలోని.. రాంపూర్, నందగోకుల్, నగరం, నగరం తండా వాసులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

సర్కారీ బడులుంటాయి. పిల్లలే కనిపించరు. కష్టపడి ఎన్‌రోల్ చేస్తారు. అయినా డ్రాపౌట్లు డజన్లకొద్దీ! ఏం చూసుకొని పంపాలి సర్కారీ బడులకు పిల్లల్ని అనేవాళ్లూ లేకపోలేదు. కానీ పరిస్థితులు ఒక్కొక్కటిగా మారిపోతున్నాయి. సర్కారీ బడుల పునర్వైభవం పట్ల ఇప్పుడిప్పుడే ఆశలు చిగురిస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రైవేట్ విద్యావ్యవస్థను పెంచిపోషించిన ప్రజలు ఇకపై ఆ కాంపౌండ్‌లకు అడుగుపెట్టొద్దని నిర్ణయించుకుంటున్నారు. విద్యార్థులుగానీ, పేరెంట్స్‌గానీ ఎవరూ ప్రైవేట్ విద్యా విధానానికి వ్యతిరేకం కాదు. ఇదంతా ప్రభుత్వ పాఠశాలల్ని బతికించుకుని.. ప్రభుత్వం అందించే విద్యను అందిపుచ్చుకోవడం కోసమేనని వారు స్పష్టం చేస్తున్నారు. ఆ ఆలోచనా ధోరణి మరింత మందిలో కలిగించేలా.. అసలు విద్యావిధానం ఎలా ఉంది? ప్రైవేట్ ప్రభావమేంటి? మార్పు ఎవరితో సాధ్యం అనే విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Medak  Govt schools  Telangana  

Other Articles