chiranjeevi visits adopted village perupalem

Chiru in development activities of mogalthur

Rajyasabha Member Chiranjeevi, chiranjeevis adopted village perupalem, chiru native mogalthur, chiru west godavari, Chiranjeevi, perupalem, mogalthur, west godavari, devlopment programs

Chiru visited Perupalem village in West Godavari district on Monday which he had adopted under Prime Minister Sansad Adarsh Gram Yojana.

తనవాళ్లు అండగా నిలవకున్నా.. తనవాళ్లకు అండగా చిరంజీవి

Posted: 02/22/2016 05:30 PM IST
Chiru in development activities of mogalthur

రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్‌ చిరంజీవి పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెంలో ఇవాళ పర్యటించారు. తన సొంత జిల్లాకు చెందిన పేరుపాలెం గ్రామాన్ని సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకునే అవకాశం వున్నప్పటికీ.. చిరంజీవి మాత్రం తన సొంత జిల్లాకే ఓటువేశారు. తనను తొలిసారిగా ప్రజాప్రతినిధిగా నిలబెట్టిన తిరుపతిని కాదని చిరంజీవి తన సొంత జిల్లాలోని పేరుపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. 2009 ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తరువాత వచ్చిన ఎన్నికలలో పాలకొట్లు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయగా, చిరంజీవిని తన జిల్లాకు చెందిన వారు ఆశీర్వదించలేదు.

అయినా తనవాళ్లే కదా అనుకున్న చిరంజీవి.. రాజ్యసభ సభ్యుడి హోదాలో తనకు ఒక గ్రామం దత్తత తీసుకునే అవకాశం రాగానే తనవాళ్లకు అయన అండగా నిలవాలనుకున్నారు. తనవాళ్లు అండగా నిలిచినా.. నిలువకపోయినా.. తాను మాత్రం తనవాళ్లకు అండగా నిలవాలనుకున్నాడు. అంతే మొగల్తూరు జిల్లాలోని పేరుపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అంతేకాదు ఆ గ్రామానికి ఇటీవలే తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి 5 కోట్ల రూపాయలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆ గ్రామస్థులు రెండు కమ్యునిటీ హాళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేయగా, తన ఇంట్లో త్వరలో జరగనున్నా శుభకార్యం నేపథ్యంలో బిజీబిజీగా వున్న వారి కోరిక మేరకు అభివృద్ది కార్యక్రమాలలో పాల్గోన్నారు. అంతేకాదు, తన కుడి చేతికి శస్త్రచికిత్స జరగినా లెక్కచేయకుండా ఆయన వెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో అందరు పార్లమెంటు సభ్యుల తరహాలో కాకుండా తన గ్రామానికి దెగ్గరుండి తాను పనులు చేయించాలనుకున్న చిరంజీవి కేవలం నిధులను మంజూరు చేసి ఊరుకోకుంగా.. అభివృద్ది కార్యక్రమాలలో కూడా పాల్గోన్నారు. కాగా, చిరంజీవిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన  బహిరంగ సభలో చిరంజీవి ప్రసంగించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  perupalem  mogalthur  west godavari  devlopment programs  

Other Articles