Mysoora Reddy may rejoins into TDP

Mysoora reddy may rejoins into tdp

TDP, Mysoora Reddy, YSRCP, Kadapa, Chandrababu Naidu, YS Jagan

TDP implementing operation Akarsh in AP. On this process YSRCP senior leader Mysoora Reddy may leaves the party and joins into TDP.

వైసీపీని వీడనున్న మైసూరారెడ్డి..?

Posted: 02/22/2016 04:23 PM IST
Mysoora reddy may rejoins into tdp

ఏపిలో తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. ప్రతిపక్ష పార్టీఐన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసి నారా చంద్రబాబు నాయుడు ఆపరేషన్ ఆఖర్ష్ కు తెర తీశారు. అయితే కర్నూల్ నేత భూమా నాగిరెడ్డి తాజాగా సైకిల్ ఎక్కేందుకు సిద్దంగా ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరోసీనియర్ వైసీపీ నేత కూడా పార్టీని వీడతారు అని పుకార్లు షికారు చేస్తున్నాయి. గత కొంత కాలగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో వైసీపీ నేత మైసూరారెడ్డి పార్టీ వీడుతున్నారని వార్త వినిపిస్తోంది. వైసీపీ పార్టీని కడప జిల్లాలో దెబ్బ తీసేందుకు టీడీసీ వర్గాలు చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు కారణం అని తెలుస్తోంది.

వైఎస్సార్సీపీ సీనియర్ నేత మైసూరారెడ్డి పార్టీ మారనున్నారా? తిరిగి సొంతగూటికే చేరనున్నారా? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. వైఎస్సార్సీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో ఆ పార్టీని నేలమట్టం చేయడమే లక్ష్యంగా టీడీపీ గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మైసూరారెడ్డితో పాటు.. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కూడా టీడీపీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇంతకు ముందు టీడీపీలో ఉన్న మైసూరారెడ్డి రాజ్యసభ పదవీకాలం ముగిసిన వెంటనే వైఎస్సార్సీపీలో చేరారు. ఆ పార్టీలో మొదట్లో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. అయితే కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అందుకు జగన్ ఆయనను పక్కకు పెట్టడమే కారణమని మాట్లాడుకుంటున్నారు.మైసూరా తమ పార్టీలోకి తిరిగి వస్తే కడప జిల్లాలో పార్టీ బలపడుతుందని టీడీపీ నాయకత్వం భావిస్తోందట. ఆ మేరకు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : TDP  Mysoora Reddy  YSRCP  Kadapa  Chandrababu Naidu  YS Jagan  

Other Articles