University representatives from state will travel to Delhi over Rohith Vemula

Union ministers not responsible for suiide of rohit vemula says committeerepot

rohith vemula, hyderabad university, kanhaiya kumar, JNU, JNU row, JNU issue, bandaru dattatreya, smruti irani, hrd officials, hyderabad central university, hcu vc apparao, students suspension, JNU students issue, kanhaiya kumar bail, kanhaiya kumar arrest, kanhaiya kumar sedition,

Around 500 students and representatives from various universities and institutions in the state will at New Delhi to intensify their demand for Justice for Rohith Vemula, the dalit PhD scholar who committed suicide

హెచ్ సీ యు యువమేధావి రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణం వాళ్లే..

Posted: 02/20/2016 12:11 PM IST
Union ministers not responsible for suiide of rohit vemula says committeerepot

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం యువ మేధావి రోహిత్ వేముల ఆత్మహత్యకు కేంద్ర మంత్రుల లేఖలే కారణమన్న అరోపణలు సత్యదూరమని తేల్చింది నిజనిర్థారణ కమిటీ. రోహిత్ వేముల ఆత్మహత్యకు ఆయన తోటి విద్యార్థుల సస్పెన్షన్‌కు కేంద్ర మంత్రుల జోక్యం కారణం కాదని కేంద్రం నియమించిన కమిటీ తేల్చింది. ఈ మొత్తం వ్యవహారంలో యూనివర్సిటీ యాజమాన్యం వైఫల్యమే కారణమని కేంద్రానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. మానవ వనరుల శాఖ నుంచి వచ్చిన లేఖలను హెచ్‌సీయూ అధికారులు సీరియస్‌గా తీసుకోలేదని నివేదికలో వెల్లడించింది.

హెచ్‌సీయూలో విద్యార్థుల సస్పెన్షన్, వివాదాలు, రోహిత్ ఆత్మహత్య తదితర ఘటనలకు వర్సిటీ యాజమాన్యం వైఫల్యమే కారణమని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. రోహిత్‌తో పాటు ప్రశాంత్, విజయ్, సుంకన్న, శేషులపై సస్పెన్షన్ వేటుకు కేంద్ర మంత్రుల జోక్యం కారణం కాదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో వర్సిటీ యాజమాన్యం చర్చలు జరపకపోవడాన్ని కమిటీ తప్పు పట్టింది. వర్సిటీ మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్టులోనూ, 2015 ఆగస్టు 3, 4 తేదీల్లో వర్సిటీ ప్రాక్టోరియల్ బోర్డు చేపట్టిన విచార ణలోనూ  తప్పులు దొర్లినట్లు విశ్లేషించింది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు గానీ, సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వ్యవస్థగానీ వర్సిటీలో లేని కారణంగా... ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు తాము వివక్షకు గురవుతున్నట్లు భావిస్తున్నారని పేర్కొంది.

ఇదిలావుండగా, రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో న్యాయం కోరుతూ సుమారు 500 మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా వున్న విశ్వవిద్యాలయాల నుంచి దేశరాజధాని డిల్లీకి వెళ్లనున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థలు ఢిల్లీకి పయనం కానున్నారు. ఫ్రిబవరి 23, 24 తేదీలలో దేశరాజధానిలో వీరు ఆందోళన నిర్వహించనున్నారు. జెఎన్ యు విశ్వవిద్యాలయ ఘటనతో దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన కేంద్రం.. రోహిత్ ఆత్మహత్య ఘటనను పక్కన బెట్టాలని చూస్తుందని, అందుకనే తాము అందోళనకు సిద్దం అవుతున్నారని సమాచారం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohit vemula  rohit suicide  HCU Officials  union ministers  

Other Articles