will send investigation officers to jail says high court

High court fires on cid on agri gold investigation

High Court, Agri gold case, CID investigation, agri gold scam, agri old scandal, agri gold ddposits, andhra pradesh, Telangana, krishna prakash, will send investigating officials to jail, agri gold chairman, agri gold managing director, agri gold accused bail,

high court fires on cid which is investigating agri gold scam, says if not investigated properly, will send investigating officials to jail

వాళ్లకు బెయిల్ వస్తే.. మీరు ఊచలు లెక్కిస్తారు జాగ్రత్తా..

Posted: 02/20/2016 12:15 PM IST
High court fires on cid on agri gold investigation

అగ్రిగోల్డ్ డిపాజిట్ల ఎగవేత వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఐడీపై హైకోర్టు నిప్పులు చెరిగింది. అగ్రిగోల్డ్ యజమాన్యానికి కొమ్ముకాస్తూ అన్ని విషయాల్లో వారికి సహకరిస్తున్నారని మండిపడింది. తాము చెప్పినప్పుడే వారిని అరెస్ట్ చేసి ఉంటే పరిస్థితి ఇక్కడివరకు వచ్చేది కాదని వ్యాఖ్యానించింది. కిందికోర్టులో నిందితులకు బెయిల్ వచ్చేందుకు సహకరిస్తే  సీఐడీ అధికారితోఊచలు లెక్కపెట్టిస్తామని హెచ్చరించింది. అంతేగాక అగ్రిగోల్డ్, దాని అనుబంధ సంస్థల బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.6 లక్షలే ఉన్నట్లు తెలుసుకున్న ధర్మాసనం విస్మయం వెలిబుచ్చింది.

పది వేల కోట్ల ఆస్తుల వివాదంలో రూ.6 లక్షలు మాత్రమే ఉండటంలో అర్థమేంటని సీఐడీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. బ్యాంకు ఖాతాల్లో నిధులన్నీ ఎక్కడకు వెళ్లాయని నిలదీసింది.  తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. అగ్రిగోల్డ్ డిపాజిట్ల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ వేర్వేరుగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాల్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది.

వేలం పర్యవేక్షణ కమిటీ తరఫు న్యాయవాది రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. అగ్రిగోల్డ్ భూముల వేలంలో పాల్గొనేందుకు ఇప్పటివరకు ఏ ఒక్క బిడ్డర్ ముందుకు రాలేదని, అందువల్ల ధరను పునఃసమీక్షించి మరోసారి బిడ్‌లను ఆహ్వానిస్తామన్నారు. ఆస్తులు సరైన స్థితిలో లేకపోవడం, ధర ఎక్కువగా ఉండటం  కారణమని చెప్పడంపై.. ధర్మాసనం స్పందిస్తూ.. ఆస్తులన్నీ వివాదరహితమైనవన్న విషయాన్ని కొనుగోలుదారుల దృష్టికి తీసుకెళ్లాలని, హైకోర్టు ఆదేశాలమేరకే వేలం వేస్తున్నట్లు, వేలం ప్రక్రియ ముగిసి సొమ్ము చెల్లించగానే వారికి యాజమాన్యపు హక్కులు సంక్రమిస్తాయని, ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రావని చెప్పాలని సూచించింది.

అగ్రిగోల్డ్ నిందితుల బెయిల్ వ్యవహారంలో సంబంధిత కోర్టుల పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు తగిన ఆదేశాలిచ్చేలా సీఐడీకి మార్గనిర్దేశం చేయాలని కృష్ణప్రకాశ్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు ఈ కేసును పర్యవేక్షిస్తున్న విషయాన్ని పీపీలద్వారా సంబంధిత కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టంచేసింది. నిందితులకు బెయిలిచ్చేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి, బెయిలొచ్చేందుకు సహకరిస్తే ఊరుకునేది లేదని, దర్యాప్తు అధికారిని ఊచలు లెక్కపెట్టిస్తామని హెచ్చరించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High Court  Agri gold case  CID investigation  jail  

Other Articles