Patriotism is a Obscene word in India

Patriotism is a obscene word in india

India, Patriotism, Patriots, JNU, Delhi, Cricket

Actually we not Patriots. Patriotism is a Obscene word in India. We are not behaving like Indians.

దేశభక్తి అంటే బూతు మాట..? మనలో దేశభక్తులు లేరు.. అంతా అబద్దం

Posted: 02/20/2016 09:52 AM IST
Patriotism is a obscene word in india

మనం మనుషులం కానీ కనీసం కుక్కకు ఉన్నంత చిత్తశుద్ది కూడా మనలో లేదు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే మనకంటే కుక్కనే చాలా బెటర్. అవును మీరు దీన్ని ఆమోదించిన ఆమోదించకపోయినా నిజం. ఎందుకంటే చిత్తశుద్దిలో మనం అసలు సాటిరాము. సరే కుక్క అంటే ఫీలవుతున్నారేమో.. ఉగ్రవాదుల కంటే మనం చాలా దుర్మార్గులం అంటే ఒప్పుకుంటారా..? కానీ అది నిజం. చదవడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా కానీ ఇది నిజమే మనం దేశభక్తులు అస్సలు కాదు. దేశభక్తి అనేది అసలు మనలో ఉంటేనే కదా దాని గురించి మాట్లాడేది. నిజాన్ని ఒప్పుకోవడానికి దైర్ఘంకావాలి.. మనం దేశభక్తులం కాదు అన్నది నిజం. అలా ఒప్పుకునే వాళ్లకు నా సలాం... కాదు తప్పు అంటే మొత్తం చదివి తర్వాత నిర్ణయించుకోండి.

దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనషులోయ్ అన్నాడు గురజాడ కానీ ఆ జాబితాలో మనం లేము. ఎందుకంటే మనం మానవత్వాన్ని ఎప్పుడో మరిచిపోయాం. ఇక దేశభక్తి గురించి అంటారా.. కొత్తగా చెప్పుకోనక్కర్లేదు.. ఎందుకంటే టీవీల్లో కనిపించేది మాత్రమే దేశభక్తి. క్రికెట్ స్టేడియంలో టీమిండియా గెలవగానే.. జెండా పట్టుకొని దేశంలో నెంబర్ వన్ దేశభక్తుడిని నేనే అన్నట్లు బిల్డప్ ఇస్తూ... భారత్ మాతకు జై.. భారత్ మాతకు జై అంటూ తెగ నినాదాలిస్తుంటాం. క్రికెట్ కు తప్ప మరెప్పుడూ మన జెండా గుర్తుకు రాదు.. దేశభక్తి కనిపించదు. ఇది మన దేశ భక్తి.

పాకిస్థాన్ బార్డర్ లో మన సైనికులు కవాతులు చేస్తుంటే గొంతెండిపోయేలా... మేరా భారత్ మహాన్.. భారత్ మాతాకు జై అంటూ అరుస్తుంటాం. వెంటనే అక్కడి విజువల్స్ ను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఎన్ని లైక్ లు, ఎన్ని కామెంట్లు వచ్చాయని చూసుకుంటాం. ఇదీ మన దేశభక్తి. అమర జవాను శవాన్ని చూడగానే బాడీలో ఎక్కడలేని దేశభక్తి పొంగుకువస్తుంది. దేశం కోసం ప్రాణాలైనా ఇస్తాం అన్న లెవల్ లో బిల్డప్ ఇస్తాం.. కానీ అదే అమరజవాను అంత్యక్రియలు జరుగుతుంటే.. టీవీల్లో సినిమాలు చూసుకుంటూ కూర్చుంటాం.. ఇదీ మన దేశభక్త

ఆగస్టు 15, జనవరి 26 అంటే సెలవు దినాలు అనేంత దేశభక్తి మనలో ఉంది. ఆగష్టు 15 రోజు ఫ్యామిలీతోపాటు ఎంజాయ్ చెయ్యడానికి ప్రభుత్వం ఇచ్చిన సెలవు అని సంతోషంతో భుజాలు తరిచే దేశభక్తి మనసొంతం. రిపబ్లిక్ డే రోజు దిల్లీ వీధుల్లో జెండాపట్టుకుని మేరా భారత్ మహోన్ అని అరిచేంత దేశభక్తి. మరి దీన్ని కూడా మనం దేశభక్తి అని అందామా.? లేదంటే దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమర వీరుల దేశభక్తిని ఏమనాలి. నిజమైన దేశభక్తులు ఎవరు.. జెండా ఎత్తితే వాళ్లకు స్పూర్తిని కానీ మనకు మాకు మాత్రం అదో ఫ్యాషన్.. సైనికులకు మన జాతీయ జెండాలోని మూడు రంగులంటే ప్రాణం కానీ మనకు మాత్రం టాటూ వేసుకొని.. ఫోటోకు ఫోజిచ్చేంత భక్తి. మనమా మన భరత మాత ముద్దుబిడ్డలం.. సిగ్గుపడదాం. సైనికుల దేశభక్తి ముందు మనం ఎంత. మన దేశభక్తి ఎంత.

ఉగ్రవాదులే మనకంటే దేశభక్తులు..
అవును ఎందుకంటే వారు నమ్మిన సిద్దాంతానికి వారు కట్టుబడి ఉంటారు. వారి లక్ష్యం కోసం వారు తమ జీవితాన్ని, ప్రాణాన్ని కూడా త్యాగం చెయ్యడానికి సిద్దంగా ఉంటారు. మరి అలాంటి వారి చిత్తశుద్ది ముందు మనమెంత.

అయినా మనం నిజమైన దేశభక్తులమే అయి ఉంటే మన దేశంలో మన మధ్యలో మన దేశానికి వ్యతిరేకంగా ఎవ్వడూ నినాదాలు చేసి ఉండేవాడు కాదు. మన దేశాన్ని ముక్కలుగా చేస్తాననే దైర్ఘ్యం ఎవరికి ఉండేది కాదు అంటే మనం దేశభక్తులం కాదు.. మేం దేశభక్తులం అని చెప్పుకొని తిరుగుతున్న బిల్డప్ గాళ్లం అతకు మించి ఏమీ కాదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Patriotism  Patriots  JNU  Delhi  Cricket  

Other Articles