Jats protest went violent in Haryana

Jats protest went violent in haryana

haryana, Violence, Jat, Jat Reservations

Union Ministers Rajnath Singh, Manohar Parrikar, Sushma Swaraj, Arun Jaitley reviewed the violence in Haryana on Friday as Jat protesters demanding reservation in jobs and education set fire to a minister's home and a mall, damaged property and burnt police vehicles. They even looted guns from an armoury. Mobs blocked highways and rail tracks. Big traffic jams were reported in Gurgaon.

రిజర్వేషన్ల కోసం జాట్ లు.. నిరసన హింసాత్మకం

Posted: 02/20/2016 09:30 AM IST
Jats protest went violent in haryana

రిజర్వేషన్ల నిప్పుల కొలిమిలో మరోసారి హర్యానా రాష్ట్రం మండిపోయింది. హర్యాణాలో జట్ల ఆందోళన హింసాత్మకంగా మారింది. వెనుకబడిన కులాల జాబితాలో తమకు రిజర్వేషన్‌ కల్పించాలంటూ ఉద్యమబాట పట్టిన జాట్ల నిరసన శుక్రవారం పూర్తిగా అదుపు తప్పింది. హరియాణా రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చింది. పలుజిల్లాల్లో భారీఎత్తున హింసాత్మక సంఘటనలు, విధ్వంసం చోటుచేసుకున్నాయి. దీంతో రెండు జిల్లాల పరిధిలో కర్ఫ్యూ విధించి, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. తొమ్మిది జిల్లాల్లో సైన్యాన్ని మోహరించారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒక వ్యక్తి మరణించగా, 25 మంది గాయపడ్డారు.

హర్యాన. రాష్ట్ర ఆర్థికమంత్రి ఇంటిని, అధికారపార్టీ భాజపాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఇంటిని తగులబెట్టారు. అనేక ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలను, ఇళ్లను, కార్యాలయాలను, రెండు టోల్‌ప్లాజాలను ధ్వంసం చేశారు. ఇదిలా వుండగా ఈ జాట్ల ఆందోళన కారణంగా ఆందోళన కారణంగా ఆసుపత్రి వెళ్లలేక ఒక క్యాన్సర్‌ రోగి మృతిచెందారు. జింద్‌ జిల్లాలోని గాంధీనగర్‌ గ్రామానికి చెందిన ఆనంద్‌ మెదడు క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. శుక్రవారం అస్వస్థతకు గురవడంతో నర్వాన్‌ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. రోగి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఇక్కడికి వంద కి.మీ. దూరంలో ఉన్న రోహ్‌తక్‌లోని పెద్దాసుపత్రికి తరలించాల్సిందిగా వైద్యులు సూచించారు. అయితే అప్పటికే జాట్ల ఆందోళన హింసాత్మకంగా మారడంతో రోగిని తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదని కుంటుంబ సభ్యులు తెలిపారు. దీంతో రెండు గంటల అనంతరం ఆనంద్‌ పరిస్థితి మరింత విషమించి మృతిచెందినట్లు వివరించారు. రోగిని రోహ్‌తక్‌ తరలించి వెంటిలెటర్‌ సౌకర్యం కల్పించి ఉంటే ప్రాణాలు దక్కేవని జిల్లా ఆసుపత్రి వైద్యుడు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : haryana  Violence  Jat  Jat Reservations  

Other Articles