mudragada padmanabham releases letter written to ap dgp jv ramudu

Mudragada padmanabham writes letter to dgp jv ramudu

mudragada padmanabham, kapu leader, andhra pradesh dgp, ap police boss, jv ramudu, mudragada gada gada, mudragada letter, mudragada letter to dgp, cases on kapus, kapu youth,

mudragada padmanabham writes a letter to ap dgp jv ramudu and releases it at his home stating to stop booking cases against kapus

గడ గడలాండించిన ముద్రగడ.. పోలీసులకు మరో లేఖ.. జైలుకెళ్లడానికైనా రెడీ..

Posted: 02/19/2016 02:53 PM IST
Mudragada padmanabham writes letter to dgp jv ramudu

తునితో కాపునాడు నిర్వహించిన ఘటనలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో అమాయకులైన వారిపై జిల్లా పోలీసులు కేసులు పెట్టడం దారుణమని కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. అమాయకులైన కాపు యువకులను టార్గెట్ చేసి పోలీసులు కేసులు బనాయించడం వింతగా వుందని ఆయన దుయ్యబట్టారు. ఈ మేరకు శుక్రవారం జె.వి. రాముడుకి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగ్రామంలో ముద్రగడ విడుదల చేశారు. తమ ఉద్యమం ఏ పార్టీకి, ఏ కులానికి వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు.

పోలీసులకు ఏ సమాచారం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ముద్రగడ ఆ లేఖలో పేర్కొన్నారు. పోలీసులు ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తామని... అలాగే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నానని డీజీపీకి రాసిన లేఖలో ముద్రగడ స్పష్టం చేశారు. అమాయకులను మాత్రం వేధించవద్దని రాముడికి రాసిన లేఖలో ఆయన్ని ముద్రగడ కోరారు. రైలు తగులపెట్టిన ఘటనలో అసలైన సంఘవిద్రోహ శక్తులను వదిలేసి.. తమ యువతపై కేసులు నమోదు చేయడం సమంజసం కాదన్నారు. ఆ ఘటన వెనకనున్నవారిని కనుగోని నిందితులపై కేసులు నమోదు చేయాలని కోరారు. లేని పక్షంలో తమ అమాయకులైన యువత కోసం జైలుకైనా వెళ్లడానికి సిద్దమని చెప్పారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mudragada padmanabham  kapu leader  andhra pradesh dgp  ap police boss  jv ramudu  

Other Articles