Campaign against public urination in Hyderabad

Campaign against public urination in hyderabad

Hyderabad, Police, Urine, Urinations on Roads

Mahankali traffic police led by inspector Rama Swamy on Thursday took up a campaigning against public urination by garlanding those relieving themselves on footpaths.

మూత్రం పోస్తే పువ్వులు.. హైదరాబాద్ పోలీస్ నయా స్టైల్

Posted: 02/19/2016 01:10 PM IST
Campaign against public urination in hyderabad

మంచి ఎవరు చేసినా అది మెచ్చుకోవాల్సిందే... అయితే తాజాగా హైదరాబాద్ లో మాత్రం పోలీసులు చెత్త పని చేసినందుకు వారిని సన్మానించారు. మామూలుగా కాదు పూలదండ వేసి చప్పట్లతో శభాష్ అని మెచ్చుకున్నారు. పైగా చేతికి గులాబీ పువ్వు కూడా ఇచ్చారు. ఇంతకీ వారు ఏం పని చేశారని అంతలా మెచ్చుకుంటున్నారు అనుకుంటున్నారా..? వాళ్లు బహిరంగంగా మూత్రం పోశారు. అవును రద్దీగా ఉండేచోట్ల మూత్రం చేసినందుకు సన్మానం చేశారు పోలీసులు.

 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఎప్పుడూ రద్దీగా కనిపిస్తుంటుంది. అలాంటి రైల్వే స్టేషన్ పక్కనే కొందరు వ్యక్తులకు పది మంది ముందు... నడి రోడ్డు మీదే పూలదండ వేశారు పోలీసులు. అంతేనా, మీరు గ్రేట్ అంటూ చేతికి గులాబీ పువ్వు కూడా అందించారు. పోలీసులు ఏంటి.. పూల దండలు వేసి.. చేతికి గులాబీలు అందించడం ఏంటని అంటారా ? అసలు వీళ్లేం చేశారనే కదా మీ డౌట్. పక్కనే పబ్లిక్ టాయిలెట్లు ఉన్నా... వాటిని వదిలేసి రోడ్లపైనే మూత్ర విసర్జన చేస్తున్నారు చాలా మంది. అందులో వీళ్లూ ఉన్నారు. దీంతో.. ఈ పరిసరాల్లో నడుచుకుంటూ వెళ్లాలంటేనే ప్రయాణికులు ముక్కు మూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

మహాంకాళి మందిర్ పోలీసులు కూడా ఇదే పని చేశారు. రోడ్డు మీద మూత్రం పోసిన ఓ వ్యక్తికి పూలదండ వేసి.. పోలీసుల చప్సట్ల మధ్య చేతిలో ఓ గులాబీ పెట్టారు. స్వచ్ఛ హైదరాబాద్ అంటూ ఎప్పటికప్పుడు ఈ ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్నా... మళ్లీ మళ్లీ అవే పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో.. బహిరంగ ప్రదేశాల్లో ఇలా మూత్ర విసర్జన చేసేవారికి వెరైటీగా వారు చేస్తున్న తప్పును వివరించేందుకే ఇలా సన్మానం చేశారు మహంకాళి ట్రాఫిక్ పోలీసులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Police  Urine  Urinations on Roads  

Other Articles