superme court tells to go high court for Kanhaiya bail

Superme court tells to go high court for kanhaiya bail

Kanhaiaya, kanhaiya Kumar, JNU, Supreme court

Arrested JNU student Kanhaiya Kumar told the Supreme Court today that he didn't feel safe to move any other court for bail because of the violence and protests by lawyers. The court, however, asked him to move the Delhi High Court first.

కన్హయ్యకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Posted: 02/19/2016 12:52 PM IST
Superme court tells to go high court for kanhaiya bail

జెఎన్ యు విద్యార్థి నాయకుడు కన్హయ కుమార్ బెయిల్ మీద సుప్రీంకోర్టు ప్రతికూలంగా స్పందించింది. దేశద్రోహం కింద కేసు నమోదుచేయబడిన కన్హయ కుమార్ తనకు తీహార్ జైల్లో ప్రాణహాని ఉందని, తన మీద తోటి ఖైదీలు ఎప్పుడైనా దాడి చెయ్యవచ్చని అందుకే బెయిల్ మంజూరు చెయ్యాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే దీని మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రతికూలంగా స్పందించారు. మీరు ముందు హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తాము ఈ కేసును విచారణకు స్వీకరించలేమని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కన్హయ కుమార్ తరఫు లాయర్లు బెయిల్ గురించి వాదన మొదలుపెట్టగానే. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ముందు మీరు కింద కోర్టును ఎందుకు ఆశ్రయించలేదు... మా వద్దకు నేరుగా ఎందుకు వచ్చారు అని ప్రశ్నించారు. దానికి కన్హయ కుమార్ తరఫు లాయర్ సమాధానమిస్తూ.. పటియాలా కోర్టులో లాయర్లు రెండు వర్గాలుగా చీలిపోయి.. కేసు వాదించడడానికి వస్తున్న లాయర్ల మీద కూడా దాడులకు పాల్పడుతున్నారని వెల్లడించారు. కాబట్టే తాము నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చామని తెలిపారు. అయితే దీనికి సమ్మతించని కోర్టు ముందు కింద కోర్టుకు (హైకోర్టుకు) వెళ్లాలని సలహా ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanhaiaya  kanhaiya Kumar  JNU  Supreme court  

Other Articles