​Vikram Singh Chauhan, the Lawyer Who Led the Patiala House Attack

Vikram singh chauhan the lawyer who led the patiala house attack

Vikram Singh Chauhan, Vikram Singh Chauhan lawyer

When the news of JNUSU President Kanhaiya Kumar’s arrest – on charges of sedition – surfaced, one man not only welcomed the news, but celebrated it. His name is Vikram Singh Chauhan.

కొట్టినందుకు లాయర్ కు సన్మానం

Posted: 02/19/2016 10:56 AM IST
Vikram singh chauhan the lawyer who led the patiala house attack

పాటియాలా హౌస్  కోర్టు వద్ద కన్హయ్య కుమార్ కు మద్దతు గా వచ్చిన విద్యార్థులపై దాడిచేసిన లాయర్ విక్రం సింగ్ చౌహన్ ను తోటి లాయర్లు సన్మానించారు.  ఢిల్లీలోని కార్కార్ డోమా కోర్టులో  లాయర్లు  విక్రంసింగ్ చౌహాన్ ను  తోటు లాయర్లు పూలమాలలతో సత్కరించి, హీరోగా పొగిడారు.  ఢిల్లీకోర్టులో  రెండు రౌండ్ల హింసాకాండలో  చౌహన్ కీలక పాత్ర వహించాడు. ఈ హింసాకాండకు సంబంధించి  ప్రశ్నించేందుకు పోలీసులు పిలిపించినా.. ఆయన వెళ్లలేదు.  సన్మాన కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు.  

లాయర్లు కూడా భారతీయ పౌరులేనని,   దేశవ్యతిరేక, పాక్ అనుకూల నినాదాలు చేసేవానిని ఎలా సహించగలరు అని విక్రం సింగ్ చౌహాన్ ప్రశ్నించారు.  ఇదో ఉద్యమంగా  పేర్కొంటూ  దేశవ్యాప్తంగా లాయర్లనుంచి మద్దతు లభిస్తోందని తెలిపారు. చౌహాన్ ఆధ్వర్యంలోనే లాయర్లు  కోర్టు ప్రాంగణంలో  విద్యార్థులు, రిపోర్టర్లపై దాడికి దిగారు. పోలీసులు కూడా లాయర్లను ఏమాత్రం అడ్డుకునేందుకు యత్నించకపోవడంతో రెచ్చిపోయారు.  విక్రం ‘ప్రతాపం’ చూపే వీడియోలు , ఫోటోలు  సోషల్ మీడియా, మీడియాలో  హల్ చల్ చేయడం , పత్రికల్లో రావడంతో  గుర్తుతెలియని వ్యక్తుల పై కేసు నమోదు చేశారు.  కాగా  జాతి వ్యతిరేక నినాదాలు చేస్తున్నవారి పట్ల తాము కేవలం అభ్యంతరం చెప్పామని చౌహన్ పేర్కొన్నారు.  అల్లర్లలో తాను పాల్గొనలేదని చౌహాన్ తెలిపారు.  ఎవరు దాడిచేసారో , కొట్టారో తమకు తెలియదన్నారు చౌహన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vikram Singh Chauhan  Vikram Singh Chauhan lawyer  

Other Articles