Freedom 251 website crashes, company says will be back in 24 hours

Telugu content

Freedom 251, buy Freedom 251, Freedom 251 website crash, Ringing Bells, Freedom 251 registrations, ringing bells, ringing bells freedom 251, freedom 251 android smartphone, freedom 251 booking, freedom 251 specs, freedom 251 cheapest mobile, world cheapest mobile freedom 251, freedom 251 features, freedom 251 price in India, ringing bells india

Freedom251.com, website that was created to order India's cheapest smartphone has now crashed with a little chance of it going up in the next 24 hours.

ఫ్రీడమ్ ఫోన్ సైట్ క్రాష్ అయ్యిందా.. లేక నిలిపేశారా..?

Posted: 02/19/2016 10:41 AM IST
Telugu content

వేల రూపాయల విలువైన వస్తువు వందల్లోనే వస్తోందంటే ఎవరు మాత్రం వద్దంటారు.. సరిగ్గా ఇప్పుడు కూడా అదే జరిగింది. దాదాపు రూ. 3-4 వేల ఖరీదుచేసే స్మార్ట్‌ఫోన్‌ను 251 రూపాయలకే ఇస్తామని చెప్పేసరికి జనం ఒక్కసారిగా ఆ సైట్ మీద పడ్డారు. ఒక్క సెకనులోనే 6 లక్షల హిట్లు రావడంతో దెబ్బకి ఫ్రీడమ్251 వెబ్‌సైట్ కాస్తా క్రాష్ అయ్యింది. గురువారం తెల్లవారుజామున 6 గంటల నుంచి ప్రీ ఆర్డర్లు తీసుకుంటామని చెప్పడంతో, ఒక్కసారిగా నెటిజన్లు ఆ సైట్ మీద పడ్డారు. దాంతో తమ సైట్ క్రాష్ అయ్యిందని రింగింగ్ బెల్స్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంతవరకు బాగానే వున్నా సైట్ క్రాష్ అయ్యిందా లేక యాజమాన్యంమే నిలిపేసిందా..? అన్న సందేహాలు చక్కర్లు కోడుతున్నాయి.

తమ పోన్ కు అద్భుతమైన స్పందన కనబర్చినందుకు థాంక్స్ అని, అయితే ఇంత భారాన్ని తట్టుకోలేక తమ సెర్వర్లు మూలపడ్డాయి, తమ సెర్వర్ అప్‌గ్రేడ్ చేసుకుని, 24 గంటల్లో మళ్లీ వస్తామని చెప్పింది. దీంతో షోషల్ మీడియాలో విమర్శల పరంపర మొదలైంది దీంతో సంస్థ వెనువెంటనే దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. అయితే ఈ ఫోన్ ను బుక్ చేసుకునే ముందు అశావహులు కొన్ని సూచనలు పాటించాలని కోరుతున్నారు నిపుణులు. కాగా ఫోన్ ప్రత్యేకతలు ఇలా వున్నాయి. 4 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్, 3.2 మెగాపిక్సెల్స్ రియర్ కెమెరా, 0.3 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్న ఫోన్‌ను 251 రూపాయలకే అందజేస్తుంది. జూన్ 30వ తేదీ నాటికి ఫోన్లు డెలివరీ చేస్తామని కూడా యాజమాన్యం పేర్కోంది.

1. రింగ్ బెల్స్ అనేది ఇప్పటి వరకు ఎలాంటి ట్రాక్ రికార్డు లేని ఓ ఎలక్ట్రానిక్ సంస్థ. దీంతో దాని నాణ్యతను ముందుగానే అంచనా వేయడం సాధ్యం కాదు.
2. మొబైల్ ఫోన్ షిప్పింగ్కు నాలుగు నెలలు సమయం పడుతుంది. ఇది దృష్టిలో ఉంచుకొని ఫోన్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
3. ఫోన్ లాంచింగ్ సమయంలో ఫ్రీడమ్ 251 కు ఒక సంవత్సరంపాటు వారంటీ ఉంటుందని చెప్పింది. కానీ, వెబ్ సైట్లో మాత్రం రిటర్న్ పాలసీ వివరాలేవీ పెట్టలేదు.
4. ఫోన్ ధర రూ. 251 కాగా, చేరవేతకు అదనంగా రూ.40 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం రూ.291 చెల్లించాల్సి ఉంటుంది.
5. ఈ ఫోన్లు కేవలం భారత్లో మాత్రమే డెలివరీ చేస్తారు. బయట దేశాల్లో ఉండే భారతీయులకు అందుబాటులో ఉండదు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles