Rahul Gandhi a traitor, should be hanged, shot, says Rajasthan BJP MLA

Rahul gandhi a traitor should be hanged shot says rajasthan bjp mla

Rahul Gandhi, JNU, JNU row, kanaiya kumar, Kailash chaudary

A BJP MLA from Rajasthan has called Congress vice-president Rahul Gandhi a “traitor” and said he should be “hanged” and “shot” for siding with “anti-national” students at Delhi’s Jawaharlal Nehru University (JNU). Kailash Chaudhary, the MLA from Barmer’s Baytoo constituency, also demanded an apology from the Congress vice-president and sought his resignation.

రాహుల్ గాంధీని ఉరితియ్యాలి.. కాల్చిచంపాలి

Posted: 02/18/2016 01:56 PM IST
Rahul gandhi a traitor should be hanged shot says rajasthan bjp mla

జేఎన్ యూ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. ఈ వివాదం నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు కత్తులు దూస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఇరకాటంలో పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. తాజాగా రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే కైలాశ్ చౌదరి... రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జెఎన్యూలో దేశద్రోహులకు మద్దతు పలుకుతున్న రాహుల్ ఒక విద్రోహి అని వ్యాఖ్యానించారు. రాహుల్ ను ఉరి తీయాలి లేదంటే..కాల్చి చంపాలంటూ మండిపడ్డారు.

రాహుల్ గాంధీ మీద బీజేపీ ఎమ్మెల్యే కైలాశ్ చౌదరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపాయి. అఫ్జల్ గురుని దేశభక్తుడిగా కీర్తిస్తూ, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన ద్రోహులను సమర్ధించిన రాహుల్ దేశంలో వుండే అర్హత లేదని ఆయన మండిపడ్డారు. కాగా జేఎన్యూ విద్యార్ధులకు మద్దతు పలికిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కూడా రాజద్రోహం కేసు నమోదు చేయాలన్న ఓ న్యాయవాది పిటిషన్ ను అలహాబాద్ విచారణకు స్వీకరించడం గమనార్హం. ఈ వ్యవహారంలో చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  JNU  JNU row  kanaiya kumar  Kailash chaudary  

Other Articles