The BLIND surfer: Fearless Brazilian rides the waves in California - despite not being able to see

Surfs up meet rabelo the blind surfer who conquered pipeline

Brazilian, Blind Surfer, Derek Rabelo, glucoma, blind, Fearless Brazilian surfer, blind surfer rides the waves in California, blind surfer conquers pipeline, brazil,

A fearless surfer showcased his incredible ability to tackle extreme waves - despite being blind. Derek Rabelo, who was named after the first Hawaiian world surfing champion.

ITEMVIDEOS: రాకాసీ క్రీడలో రాణించాడు.. అంధత్వాన్ని, సముద్రాన్ని జయించాడు..

Posted: 02/18/2016 01:21 PM IST
Surfs up meet rabelo the blind surfer who conquered pipeline

సర్ఫింగ్ అంటేనే సాహస క్రీడ.  రాకాసి అలల తీరును అంచనా వేస్తూ.. వాటిపై అధిరోహిస్తూ.. సర్ఫింగ్ చేయడమంటే.. అన్నీ సవ్యంగా ఉన్నవాళ్లే జంకుతారే.. అలాంటిది తన తండ్రి ఆశయాన్ని నిజం చేయాలని ఓ యువకుడు పడిన తపన నిజరూపం దాల్చింది. అందులో వింతేముంది అంటారా.. వాయువేగం.. దానికి తోడే అలల తీవ్రతను అంచనా వేయాలి అంటే నయనాలు అత్యంత అవసరం. దానికి తోడు ఎలా వెళ్లాలన్న అలోచనలు కూడా అంతే అవసరం. కానీ తన తండ్రి అశయాన్ని నెరవేర్చేందుక ఓ అంధుడు కూడా సర్పింగ్ విధ్యలో అద్భుతంగా రాణించాడు. అత్యంత క్లిష్టమైన పైప్ లైన్ ను కూడా చేధించి మునుపెన్నడూ లేని రికార్డులను నెలకొల్పాడు.

కెరిక్ రెబెలో పుట్టకముందే తన తండ్రి సర్పర్ ను చేయాలనుకున్నాడు. ఎందకంటే అతనికి ఆ క్రీడ అంటే అంత ఇష్టం. అయితే డెరిక్ రెబెలో గ్లుకోమా అనే కంటి వ్యాదితో చూపు లోపంతో పుట్టాడని చెప్పగానే.. రెబెలో తండ్రి ఆశలు అడియాశలయ్యాయి. ఇప్పటి వరకు ఏ అంధుడూ సర్ఫింగ్ చేయగా చూడలేదేనే అవేదన అయనలో నెలకొంది. దీంతో తన కొడుకును సర్ఫర్ చేయాలనే ఆశలకు ఫుల్‌స్టాప్ పెట్టేశాడు..  కానీ డెరెక్ పెట్టలేదు. కలల్లో బతకడం అతడికి ఇష్టం లేదు.. కళ్లు లేకున్నా.. తండ్రి కలల సాకారంపైనే అతడి దృష్టంతా.. అందుకే 17 ఏళ్ల వయసులో సర్ఫింగ్ కోర్సులో జాయిన్ అయ్యాడు. గతంలో ఎక్కడైనా అంధుడు సర్ఫింగ్ చేయడం చూశామా? ఇది ప్రాణాలకే ప్రమాదం అంటూ అందరూ నిరుత్సాహపరిచారు.

అయితే డెరిక్ కు అతని తండ్రి తోడుగా నిలిచాడు. మూడేళ్ల అత్యంత కఠినమైన శిక్షణ.. సర్ఫింగ్ కోసం తనకున్న అమోఘమైన వినికిడి శక్తిని డెరెక్ ఉపయోగించుకున్నాడు. సీన్ కట్ చేస్తే.. అలలపై అలవోకగా సర్ఫింగ్ చేస్తూ.. ప్రపంచ ప్రఖ్యాత సర్ఫర్లతో శెభాష్ అనిపించుకుంటున్నాడు.  ‘నేను సాగరుడి శబ్దాన్ని వింటాను.. దాన్ని ఆస్వాదిస్తాను.. ప్రతి అల ఒక విభిన్నమైన శబ్దాన్ని చేస్తుంది. అదే నాకు దారి చూపుతుంది’ అని డెరెక్ చెబుతున్నాడు. అంతేనా.. డెరెక్ స్ఫూర్తిదాయక గాథపై ఇప్పటికే ఓ సినిమాతోపాటు పలు డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి.  .. డెరెక్.. సముద్రాన్ని జయించాడు..

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brazilian  Blind Surfer  Derek Rabelo  

Other Articles