tension in patiyala court on JNU University contraversy

Tension in patiyala court on jnu university contraversy

JNU University, Kanhaiah, Modi, Patiyala court

Lawyers including Vikram Chauhan raised slogans of 'Vande Mataram' and 'Bharat Mata Ki Jai' outside Patiala House Court complex in New Delhi. The protests were reported after SC restricted entry in Kanhaiya Kumar's hearing.

కొట్టుకున్న లాయర్లు.. పటియాలా కోర్టు వద్ద ఉద్రిక్తత

Posted: 02/17/2016 03:18 PM IST
Tension in patiyala court on jnu university contraversy

సుప్రీంకోర్టులో న్యాయవాదులు చేసిన చర్య అందరికి ఆశ్చర్యం కలిగించింది. సుప్రీంకోర్టులో న్యాయవాదులు ఒక్కసారిగా వందేమాతరం అంటూ నినదించడంతో అక్కడున్న జడ్జిలతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న సుప్రీంకోర్టు మళ్లీ ఇలాంటి చర్యలకు దిగవద్దని న్యాయవాదులను గట్టిగానే హెచ్చిరించింది. అయితే ఇలా చెప్పిన కొద్ది గంటల వ్యవధిలోనే పటియాలా కోర్టు ఆవరణ రణరంగంగా మారింది. జేఎన్‌యూ విద్యార్థులకు వ్యతిరేకంగా కొందరు లాయర్లు నినాదాలు చేశారు. కోర్టులో పహారా కాస్తున్న పోలీసులు లాయర్ల ఘర్షణను అడ్డుకోలేకపోయారు.

మేము గుండాలం కాదు, దేశభక్తులంటూ ఘర్షణకు దిగిన ఓ వర్గ లాయర్లు నినాదాలు చేశారు. కన్నయ్య కుమార్ విచారణ సందర్భంగా సుప్రీం చేసిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ లాయర్లు మళ్లీ విరుకుపడడం శోచనీయంగా కనిపిస్తోంది. ఘర్షణను ఫోటోల్లో బంధిస్తున్న ఫస్ట్‌పోస్ట్‌కు చెందిన ఓ ఫోటో జర్నలిస్టుపై లాయర్లు దాడి చేశారు. కాగా పటియాలా కోర్టులో జర్నలిస్ట్ ల మీద జరిగిన దాడి మీద జర్నలిస్ట్ సంఘాలు ర్యాలీ నిర్వహించి తమ నిరసన తెలిపాయి. కాగా మోదీతో భేటీ అయిన ల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ జెఎన్ యూ విద్యార్థి నాయకుడు కన్హయా అరెస్టుకు తగిన సాక్షాధాలున్నాయని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JNU University  Kanhaiah  Modi  Patiyala court  

Other Articles