Police arrested four SIMI terrorists in Odisha

Police arrested four simi terrorists in odisha

Police, Telangana, Odisha, Terrorists, SIMI Terrorists

Telangana Police arrested four SIMI Terrorists who escaped from MadhyaPradesh jail. After three hours firing finally police arrest them

నలుగురు ఉగ్రవాదులను పట్టుకున్న తెలంగాణ పోలీసులు

Posted: 02/17/2016 02:54 PM IST
Police arrested four simi terrorists in odisha

ఒడిశాలో తలదాచుకున్న నలుగురు సిమి ఉగ్రవాదులను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. రావూర్ ఖిలా కురేచిలో ఉగ్రవాదులు ఉంటున్న ఇంటిపై అర్ధరాత్రి ఒడిశా పోలీసుల సహకారంతో నల్గొండ పోలీసులు దాడి చేశారు. సుమారు 3 గంటల పాటు ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం ఎట్టకేలకు నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 పిస్టళ్లు, బుల్లెట్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు 2013లో మధ్యప్రదేశ్‌ లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న సిమి ఉగ్రవాదులుగా గుర్తించారు.

ఖాండ్వా జైలు నుంచి ఆరుగురు ఉగ్రవాదులు తప్పించుకోగా, గత సంవత్సరం ఏప్రిల్‌-లో నల్గొండ జిల్లాలో పోలీసుల ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులు ఎజాద్‌, అస్లామ్‌ హతమయ్యారు. మిగిలిన అబూ ఫైజల్‌, మహబూబ్‌, అంజాద్‌, జకీర్‌-లు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు ఒడిశా డీజీపీ కేబీసింగ్‌ ప్రకటించారు. కాగా తెలంగాణ, ఒడిశా పోలీసులు కలిసి కట్టుగా నిర్వహించిన ఆపరేషన్ లో ఉగ్రవాదులను పోలీసులు పట్టుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  Telangana  Odisha  Terrorists  SIMI Terrorists  

Other Articles