Railways is like 'Jersey cow', govt neither milked nor took care of it: Lalu Yadav to Modi

An open letter to pm modi from lalu prasad yadav

Railways, Jersey cow, Lalu Prasad Yadav, Narendra Modi, Modi, Modi government, Modi Govt, Indian Railways, Rashtriya Janata Dal, lalu railways jersy cow, Indian Railways, Railway, Suresh Prabhu, Railway Budget new trains, Railway Budget fare hike, railway budget 2016, Budget 2016 expectations, rail Budget 2016

On the eve of the parliamentary budget session, Rashtriya Janata Dal (RJD) chief Lalu Prasad Yadav on Monday likened the Railways to a 'Jersey cow' and said that the Modi government has “neither milked nor took care of it”.

రైల్వే శాఖ జెర్సీ అవు.. కేంద్రానికే పాలు పితకడం రాదు.. సరిగ్గా చూసుకోవడం రాదు

Posted: 02/16/2016 03:06 PM IST
An open letter to pm modi from lalu prasad yadav

మరో వారంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ, రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్రంపై, ప్రధాని మోదీపై తనదైన శైలిలో వ్యంగ్య విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోడీతో పాటు రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుపై కూడా ఆయన వ్యంగస్త్రాలు సంధించారు. మరో వారం రోజుల్లో సురేష్ ప్రభు ముచ్చటగా మూడవసారి తన రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న సందర్బాన్ని పురస్కరించుకుని లాలూ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు.

భారతీయ రైల్వేలు 'జర్సీ ఆవు' వంటిదని వ్యాఖ్యానించచారు. అయితే, మోదీ ప్రభుత్వం పాలు పిండుకోలేకపోతున్నదని, కనీసం ఆవుకు తిండి కూడా పెట్టలేకపోతుందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం తన చేతిలో వున్న జెర్సీ ఆవును కనీసం సరిగ్గా చూసుకోలేకపోతున్నదని ధ్వజమెత్తారు. రైల్వే శాఖకు 'అచ్చే దిన్' రాలేదని మండిపడ్డారు. పైగా ప్రైవేటు పరం చేసేందుకు అడుగులు పడుతున్నాయని భయంగా ఉందని ప్రధాని మోదీకి రాసిన బహిరంగ లేఖలో లాలూ వ్యాఖ్యానించారు. రైల్వే మంత్రిగా 3వ సారి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న సురేష్ ప్రభుకు వాస్తవ పరిస్థితిపై పూర్తి అవగాహన ఉందన్నారు. రైల్వేలను అభివృద్ధి చేయడానికి సమయం మించిపోలేదని, ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు. అటు పాలు పితక్కుండా, తిండీ పెట్టకుండా ఉంటే ఆవు ఒట్టి పోతుందని, అటువంటి పరిస్థితే రైల్వేలకు రాకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suresh Prabhu  Lalu Prasad Yadav  railway budget  jersy cow  Modi  

Other Articles