Group of Lawyers Turn Violent at Patiala House Court

Group of lawyers turn violent at patiala house court

Delhi, patiyala court, JNU, lawyers, Attack on Jornalists

Teachers and students of the Jawaharlal Nehru University and journalists were attacked and threatened at a Delhi court today as dozens of policemen watched. The violence erupted just before a JNU student arrested for sedition was to be produced.

ITEMVIDEOS: జర్నలిస్టులు, విద్యార్థుల దాడి.. పటియాలా కోర్టు వద్ద ఉద్రిక్తత

Posted: 02/15/2016 04:09 PM IST
Group of lawyers turn violent at patiala house court

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వివాదం కొత్త మలుపు తిరిగింది. కోర్టు ఆవరలోనే విద్యార్థుల మీద, మీడియా జర్నలిస్టుల మీద లాయర్లు రాళ్లతో దాడికి దిగారు.  కోర్టుకు విద్యార్థి నేతను తీసుకొచ్చిన సమయంలో లాయర్లకు, విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జేఎన్‌యూ విద్యార్థులు, మీడియాపై ఆ కోర్టు లాయర్లు విరుచుకుపడ్డారు. సీనియర్ జర్నలిస్టులపై దాడికి దిగారు. జేఎన్‌యూ విద్యార్థులపైన కూడా లాయర్లు చేయిచేసుకున్నారు. దీంతో కోర్టు ప్రాంగణమంతా యుద్ధ వాతావరణంలా మారింది. పంచ్‌లు విసిరిన లాయర్లు బీజేపీ నేతలంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఓ ఇంగ్లీష్ ఛానల్‌కు చెందిన రిపోర్టర్ గాయపడ్డారు.

దేశ ద్రోహం కేసులో విద్యార్థి నేత కన్నయను కోర్టులో ఇవాళ హాజరుపరిచారు. కాగా లాయర్ల కోట్ లు వేసుకున్నది బిజెపి కార్యకర్తలే అని కావాలనే వారు తమ మీద దాడులకు పాల్పడ్డారని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటి నాయకులు మండిపడుతున్నారు. కాగా మీరు జెన్ యు విద్యార్థులా అని అడిగి మరీ దాడికి పాల్పడ్డారని అక్కడి విద్యార్థులు వెల్లడించారు. మరోపక్క ఎబివిపి కార్యకర్తలు భారత్ కు వ్యతిరేకంగా.. అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు చేస్తున్న వీడియోను విడుదల చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Delhi  patiyala court  JNU  lawyers  Attack on Jornalists  

Other Articles