NRI Techie Cheats Warangal Woman after Marriage

Nri techie cheats warangal woman after marriage

UK, NRI, Warangal, NRI cheats, NRI Techie cheats

NRI Techie Cheats Warangal Woman after Marriage NRI techie leaves his wife in India and he went to UK

ITEMVIDEOS: పెళ్లైన మూడు నెలలకు కనిపించకుండాపోయిన ఎన్నారై

Posted: 02/15/2016 04:35 PM IST
Nri techie cheats warangal woman after marriage

పెళ్లికొడుకు ఎన్నారై అయితే చాలు మిగతావి ఏవి అవసరం లేదనుకుంటున్నారు ప్రస్తుతం అమ్మాయిలు. పిల్లలతో పాటు తల్లిదండ్రులదీ అదే మెంటాలిటి. అలా నమ్మి నట్టేటమునిగిపోతున్నారు చాల మంది. పచ్చగా పదికాలాల పాటు ఉండాల్సిన కాపురం పట్టుమని పదిరోజులు కాకుండానే ముగిసిపోతున్నాయి. అసలు విషయానికి వస్తే... వరంగల్ పట్టణానికి చెందిన యువతి ప్రశాంతి.. మ్యాట్రిమోని ద్వారా పరిచయం అయిన ఎన్నారైని పెళ్లి చేసుకుంది. మూడు నెలలు సరిగ్గానే ఉన్న ఎన్నారై శ్రవణ్ ఏమైందో ఏమో ..ప్రశాంతిని వదిలేసి యుకేకి చెప్పకుండ పారిపోయాడు.

ఎన్నారై సంబందం అయితే చాలు... అబ్బాయి విదేశాల్లో ఉంటే చాలు తమ బిడ్డ జీవితం సుఖంగా సాగుతుంది అని అపోహపడి.. తమ బిడ్డకు పెళ్లి చేసిన అమ్మాయి తల్లిదండ్రులకు షాక్ ఇచ్చాడు ఓ ఘరానా మోసగాడు. నమ్మి వచ్చిన వారిని నట్టేట ముంచి పతా లేకుండా ఉడాయించాడు. హైదరాబాదులోని ఎల్బీనగర్ కు చెందిన శ్రవణ్ యుకే లో ఉంటున్నాడు. వదిలేసి వెళ్లిన శ్రవణ్‌కు ప్రశాంతి తరువాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిప్ట్ చేయటం లేదు. దీంతో విసిగిపోయిన ప్రశాంతి డిజీపీకి ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ వేడుకోంటుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UK  NRI  Warangal  NRI cheats  NRI Techie cheats  

Other Articles