Gold price skyrockets, inches closer to Rs 30,000-mark

Gold price skyrockets inches closer to rs 30 000 mark

Gold Price, India, Gold, Stock Market, Gold Rate

Gold skyrocketed to Rs 29,650 per ten grams Friday by adding Rs 850, largely in tandem with a firming trend overseas. Now, the yellow metal has gained Rs 2,600 in the eleven straight sessions, its longest winning streak this year.

30 వేలకు చేరిన బంగారం ధర

Posted: 02/13/2016 08:46 AM IST
Gold price skyrockets inches closer to rs 30 000 mark

మరింత ఎగబాకిన పసిడి ధర 30 వేలకు చేరువైంది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు మందకొడిగా ఉండటం, క్రూడాయిల్ ధరలు, స్టాక్ మార్కెట్లు నేలచూపులు చూస్తుండటంతో అతి విలువైన లోహాల ధరలు రోజుకింత ప్రియమవుతున్నాయి. దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలోఆభరణాల కొనుగోళ్లు ఊపందుకోవడంతోపాటు రూపాయి విలువ క్షీణించడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని బులియన్ వర్గాలంటున్నాయి.

శుక్రవారం చెన్నై బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.1,230 పెరిగి రూ.29,605కి చేరుకుంది. గడిచిన 11 సెషన్లలో గోల్డ్ రేటు రూ.2,600 మేర పెరిగింది. పసిడితోపాటు వెండి కూడా పుంజుకుంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.750 ఎగబాకి రూ.37,850 పలికింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం రూ.29,800కు చేరుకోగా.. 22 క్యారెట్ల రేటు రూ.29,500గా నమోదైంది. కిలో వెండి రూ.39 వేలు పలికింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gold Price  India  Gold  Stock Market  Gold Rate  

Other Articles